Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 52:3 - పవిత్ర బైబిల్

3 యెహోవా చెబుతున్నాడు, “నీవు డబ్బుకు అమ్మబడలేదు. అందుచేత డబ్బు లేకుండనే నీవు రక్షించబడతావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెహోవా ఇలా చెబుతున్నాడు “మిమ్మల్ని ఉచితంగా అమ్మేశారు గదా! ఉచితంగానే మీకు విమోచన వస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 యెహోవా చెప్పే మాట ఇదే: “మీరు ఉచితంగా అమ్మబడ్డారు, డబ్బులు ఇవ్వకుండానే మీరు విడిపించబడతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 యెహోవా చెప్పే మాట ఇదే: “మీరు ఉచితంగా అమ్మబడ్డారు, డబ్బులు ఇవ్వకుండానే మీరు విడిపించబడతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 52:3
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు. ధర విషయం నీవేమీ వాదించలేదు.


మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు. మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.


దేవుడు మంచివాడు, ఆయన సరైన వాటినే చేస్తాడు. కనుక ఆయన సీయోనును, తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రజలను రక్షిస్తాడు.


కోరెషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని నేనే అతనికి ఇచ్చాను. అతని పని నేను సులభం చేస్తాను. కోరెషు నా పట్టణాన్ని మరల నిర్మిస్తాడు. అతడు నా ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. కోరెషు నా ప్రజలను నాకు అమ్మడు. అతడు ఈ పనులు చేసేందుకు అతనికి నేనేమీ చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రజలు విమోచించబడతారు. దానికి నాకేమీ ఖర్చుకాదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.


యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీ తల్లి యెరూషలేముకు నేను విడాకులిచ్చానని మీరంటున్నారు. అయితే ఆమెను నేను విడనానట్లు నిదర్శన కాయితాలు ఏయి? నా పిల్లలారా, ఎవరికైనా నేను డబ్బు రుణం ఉన్నానా? అప్పు తీర్చటానికి నేను మిమ్నల్ని అమ్ముకొన్నానా? లేదు. చూడండి, మీరు చేసిన చెడ్డ పనుల మూలంగానే నేను మిమ్మల్ని విడిచి పెట్టేసాను. మీ తల్లి (యెరూషలేము) చేసిన చెడ్డ పనుల వల్లనే ఆమెను నేను పంపివేశాను.


ఆయన ప్రజలు, “పరిశుద్ధ ప్రజలు” “విమోచించబడిన యెహోవా ప్రజలు” అని పిలువబడతారు. “దేవుడు కోరే పట్టణం” “దేవుడు తోడుగా ఉన్న పట్టణం” అని యెరూషలేము పిలువబడుతుంది.


ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను. నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది.


యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి. ఆ సంపదను పరులకు ఇస్తాను. అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు. నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను. ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది. యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.


దేవుడు ఇలా చెప్పసాగాడు: “కాని, నీవు అసలైన వేశ్యలా లేవు. ప్రతి బాట మొదట నీవు నీ గుట్టలను ఏర్పాటు చేశావు; ప్రతి వీధి చివర నీ ఆరాధనా స్థలాలు నెలకొల్పావు. ఆ మనుష్యులందరితో నీవు వ్యభిచరించావు. అయినా, నిజంగా ఒక వేశ్య అడిగినట్లు నీవు వారిని డబ్బు అడగలేదు.


పొలాల్లో పెరిగే చెట్లు ఫలాల నిస్తాయి. భూమి తన పంటనిస్తుంది. కావున గొర్రెలు తమ భూమిమీద సురక్షితంగా ఉంటాయి. బానిసత్వానికి చిహ్నమైన వాటి మెడమీది కాడిని నేను విరుగగొడతాను. వాటిని బానిసలుగా చేసిన మనుష్యుల అధికారం నుండి వాటికి విముక్తి కలుగజేస్తాను. అప్పుడు నేనే యెహోవానని అవి గుర్తిస్తాయి.


“ఆ వ్యక్తిని ఎవకూ కొనకపోయినప్పటికి, అతడు స్వతంత్రుడు అవుతాడు. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో అతడు, అతని పిల్లలు స్వతంత్రులవుతారు.


ఎందుకంటే, మీ పూర్వికులు వంశపారంపర్యంగా మీ కందించిన వ్యర్థజీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించిపోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగలేదు. ఈ విషయం మీకు తెలుసు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ