యెషయా 52:1 - పవిత్ర బైబిల్1 మేలుకో! మేలుకో! సీయోనూ మేలుకో. నీవు వస్త్రాలు ధరించు. నీ బలంతొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో! దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు, పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్ర ములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సీయోనూ! లే! నీ బలం తెచ్చుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ అందమైన బట్టలు వేసుకో. ఇక ఎన్నటికీ సున్నతి పొందని వాడొకడైనా, అపవిత్రుడొకడైనా నీ లోపలికి రాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సీయోనూ, మేలుకో మేలుకో, నీ బలాన్ని ధరించుకో! పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో. సున్నతి పొందనివారు గాని అపవిత్రులు గాని నీ లోనికి మరలా ప్రవేశించరు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సీయోనూ, మేలుకో మేలుకో, నీ బలాన్ని ధరించుకో! పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో. సున్నతి పొందనివారు గాని అపవిత్రులు గాని నీ లోనికి మరలా ప్రవేశించరు. အခန်းကိုကြည့်ပါ။ |
దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు.
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నిజంగా సున్నతి సంస్కారం పొందని విదేశీయుడెవ్వడూ నా ఆలయంలోకి రాకూడదు. అట్టివాడు శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్న వాడైనా నా ఆలయ ప్రవేశానికి అర్హుడు కాడు. అతడు నా ఆలయ ప్రవేశం చేసే దానికి ముందు సున్నతి సంస్కారం పొంది తనను తాను నాకు పూర్తిగా సమర్పించుకోవాలి.