Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 51:23 - పవిత్ర బైబిల్

23 నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమనివారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదావారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 51:23
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు. నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.


మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు. అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు. కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.


మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది.


మంచి మనుష్యులకు దుర్మార్గులు చేసే దుర్మార్గపు పనులన్నిటికీ తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నిజాయితీ లేని మనుష్యులు నిజాయితీగల వాళ్లకు చేసే వాటన్నింటికీ శిక్ష చెల్లించాల్సి ఉంటుంది.


ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు. అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని చిందిస్తారు. నువ్వు అంతరిస్తావు నువ్వెప్పుడూ లేనట్లుగా ఉంటుంది.


నా శత్రువు ఇది చూసి సిగ్గుపడతాడు. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నడిగాడు. ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టిమీద నడిచినట్లు జనులు ఆమెమీద నడుస్తారు.


“చూడండి, నేను యెరూషలేమును దాని చుట్టూ ఉన్న దేశాలకు ఒక విషపు గిన్నెలా చేస్తాను. దేశాలు వచ్చి, ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా అంతా బోనులో చిక్కుతుంది.


కనుక ఆ ఐదుగురు రాజులను వారు యెహోషువ దగ్గరకు తీసుకొని వచ్చారు. యెహోషువ తన మనుష్యులందరినీ ఆ చోటికి పిలిచాడు. “ఇక్కడికి వచ్చి, ఈ రాజుల మెడలమీద మీ పాదాలు పెట్టండి” అని తన సైన్యాధికారులతో యెహోషువ చెప్పాడు. అందుచేత యెహుషువ సైన్యాధికారులు దగ్గరగా వచ్చారు. వారు ఆ రాజుల మెడలమీద తమ పాదాలు పెట్టారు.


కాని వెలుపలి ఆవరణం, యూదులు కానివాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభై రెండు నెలల దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు.


నీవు చూసిన ఆ స్త్రీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ