యెషయా 49:25 - పవిత్ర బైబిల్25 అయితే యెహోవా చెబుతున్నాడు, “బలమైన సైనికుని దగ్గర్నుండి ఖైదీలు తప్పించబడతారు. ఆ ఖైదీలు తప్పించుకొంటారు. ఇది ఎలా జరుగుతుంది? నీ యుద్ధాలు నేను పోరాడుతాను నీ పిల్లల్ని నేను రక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –బలాఢ్యులు చెరపెట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపెట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అయితే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నియంత దగ్గర నుంచి బందీలను విడిపించడం జరుగుతుంది. బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము తీసుకోవడం జరుగుతుంది. నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 అయితే యెహోవా చెప్పే మాట ఇదే: “అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు, క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది; నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేను రక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 అయితే యెహోవా చెప్పే మాట ఇదే: “అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు, క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది; నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేను రక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.
యెహోవా, అక్కరలో ఉన్న పేద ప్రజలకు నీవు క్షేమ స్థానంగా ఉన్నావు. అనేక సమస్యలు ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. కానీ నీవు వారిని కాపాడుతావు. యెహోవా, నీవు వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే గృహంలా ఉన్నావు. కష్టాలు భయంకర గాలుల్లో, వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి పోతుంది, కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ తగలదు.