Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 48:6 - పవిత్ర బైబిల్

6 “జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, విన్నారు గనుక మీరు ఇతరులకు ఈ వార్త చెప్పాలి. మీకు ఇంకా తెలియని క్రొత్త సంగతులను ఇప్పుడు నేను మీకు చెబుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలో చించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నువ్వు ఈ విషయాలు విన్నావు. ఈ వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. అవి నిజమని నీవు ఒప్పుకోవా? “నీకు తెలియకుండా దాచబడిన క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. అవి నిజమని నీవు ఒప్పుకోవా? “నీకు తెలియకుండా దాచబడిన క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 48:6
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు. ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.


జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.


యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.”


ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి. కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు. అతడు తన చెవులతో వినగలడు. కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.”


“నేను యెహోవాను. నా పేరు యెహోవా. నేను నా మహిమను మరొకరికి ఇవ్వను. నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలకు (అబద్ధపు దేవుళ్ళకు) చెందనివ్వను.


కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను, ఆ సంగతులు జరిగాయి. ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి, అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.”


ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.


ఇవి చాలాకాలం క్రిందట జరిగిపోయిన సంగతులు కావు. ఇవి ఇప్పుడు సంభవించటం మొదలైన సంగతులు. ఈ సంగతులను గూర్చి ఈ వేళకు ముందు మీరు ఎన్నడూ వినలేదు. అందుచేత ‘అది మాకు ముందే తెలుసు’ అని మీరు చెప్పజాలరు.


ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి. “ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా? వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా? ‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది. యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు. కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?


“ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు.


“అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి! జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి! పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి, ‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది. బేలు దైవం అవమానపర్చబడుతుంది. మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది. బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి. దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’


హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే ప్రజలు భయంతో వణుకుతారు. ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే, దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.


దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేమును) పిలుస్తూవుంది. తెలివిగల మనుష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు. కావున శిక్షించే దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవానిపట్ల ధ్యానముంచు!


నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.


నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.


కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.


దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు. ఎవరి చెవులు వినలేదు. ఎవరూ వాటిని ఊహించలేదు.”


అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి.


ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ