యెషయా 48:21 - పవిత్ర బైబిల్21 యెహోవా తన ప్రజలను అరణ్యంలో నడిపించాడు. ఆ ప్రజలు ఎన్నడూ దప్పిగొనలేదు. ఎందుకంటే, ఆయన తన ప్రజలకోసం బండనుండి నీళ్లు ప్రవహింపజేశాడు గనుక. ఆయన బండను చీల్చాడు. నీళ్లు ప్రవహించాయి.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను వారు దప్పిగొనలేదు రాతికొండలోనుండి వారికొరకు ఆయన నీళ్లు ఉబుక జేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఎడారుల్లో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం వేయలేదు. వారి కోసం బండలోనుంచి నీళ్లు ఉబికేలా చేశాడు. ఆయన ఆ బండ చీల్చాడు. నీళ్లు పెల్లుబికాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 ఎడారుల గుండా ఆయన వారిని నడిపించినా వారికి దాహం వేయలేదు; ఆయన వారి కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశారు. ఆయన బండను చీల్చారు, నీళ్లు ఉప్పొంగుతూ బయటకు వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 ఎడారుల గుండా ఆయన వారిని నడిపించినా వారికి దాహం వేయలేదు; ఆయన వారి కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశారు. ఆయన బండను చీల్చారు, నీళ్లు ఉప్పొంగుతూ బయటకు వచ్చాయి. အခန်းကိုကြည့်ပါ။ |
వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు. కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల ప్రక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేనా విధంగా వారికి దారి చుపుతాను. కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.