యెషయా 48:20 - పవిత్ర బైబిల్20 నా ప్రజలారా, బబులోను విడిచిపెట్టండి. నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి. ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి. భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు దాని ప్రక టించుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి! యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా నాతో చెప్పాడు, “నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన సేవకుడివి. ఇశ్రాయేలు ప్రజలు ఖైదీలు. వారు తిరిగి నా వద్దకు తీసుకొని రాబడతారు. అప్పుడు యాకోబు కుటుంబ దళాలు తిరిగి నా వద్దకు వస్తారు. అయితే నీకు మరో పని ఉంది; అది దీనికంటె ఇంకా ముఖ్యమయింది. సమస్త రాజ్యాలకు నిన్ను నేను వెలుగుగా చేస్తాను, భూమిమీద మనుష్యులందరినీ రక్షించేందుకు నీవే నా మార్గంగా ఉంటావు.”
ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి. కానీ యెహోవా వారికి విరోధంగా లేడు. యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు. కనుక యెహోవా ప్రజలను రక్షించాడు. వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు. మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు.
బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు. వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు. యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు, బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నాడని వారు చెబుతున్నారు. యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.