యెషయా 48:18 - పవిత్ర బైబిల్18 మీరు నాకు విధేయులై ఉంటే అప్పుడు మీకు నిండుగా ప్రవహిస్తోన్న నదివలె శాంతి లభించి ఉండేది. సముద్ర తరంగాల్లా మంచివి మీ వద్దకు ప్రవహించి ఉండేవి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరు చున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఎంత బాగుంటుంది! అప్పుడు నీ శాంతి, సౌభాగ్యం నదిలా పారేవి. నీ విడుదల సముద్రపు అలల్లా ఉండేది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే నీ సమాధానం నదిలా నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే నీ సమాధానం నదిలా నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి. အခန်းကိုကြည့်ပါ။ |
ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు.
యెహోవా చెబుతున్నాడు: “చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ త్రాగుతారు. మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు. మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.