యెషయా 47:8 - పవిత్ర బైబిల్8 కనుక ‘అందమైన అమ్మాయీ’, ఇప్పుడు నా మాట విను. నీవు క్షేమంగానే ఉన్నావు అనుకొంటున్నావు. ‘నేను ఒక్కదాన్నే ప్రాముఖ్యమైన దాన్ని, ఇంకెవ్వరూ నా అంతటి ప్రముఖులు కారు. నేను ఎప్పటికీ విధవనుకాను. నాకు ఎల్లప్పుడూ పిల్లలు ఉంటారు’ అని నీలోనీవు అనుకొంటున్నావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు –నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి సుఖాసక్తితో నిర్భయంగా జీవిస్తూ “నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. నేనెన్నటికీ విధవరాలిని కాను, పుత్రశోకం నాకు కలగదు” అనుకుంటున్నావు. ఇదిగో, ఈ మాటను విను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 “నీవు సుఖాన్ని ప్రేమిస్తూ క్షేమంగా జీవిస్తూ, ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. నేను ఎప్పటికీ విధవరాలిని కాను బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, కాని ఇప్పుడు ఈ మాట విను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 “నీవు సుఖాన్ని ప్రేమిస్తూ క్షేమంగా జీవిస్తూ, ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. నేను ఎప్పటికీ విధవరాలిని కాను బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, కాని ఇప్పుడు ఈ మాట విను. အခန်းကိုကြည့်ပါ။ |
అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు.
నీనెవె ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అది చాలా సంతోషంతో నిండిన పట్టణంగా ఉంది. ఆ ప్రజలు క్షేమంగా ఉన్నామని తలుస్తున్నారు. ప్రపంచమంతటిలో నీనెవె పట్టణమే మహా గొప్ప పట్టణమని వారు తలుస్తున్నారు. కాని ఆ పట్టణం నాశనం చేయబడుతుంది! అది అడవి జంతువులు పండుకొనేందుకు వెళ్లే శూన్య ప్రదేశం అవుతుంది. ఆ స్థలం ప్రక్కగా వెళ్ళే మనుష్యులు ఆ పట్టణం అంత విపరీతంగా నాశనం చేయబడటం చూసినప్పుడు వారు తలలు ఊవుతూ ఈలలు వేస్తారు.
కాగా మీకా చేసిన విగ్రహాలను దాను వంశీయులు తీసుకొనిపోయారు. మీకాతో ఉండిన యాజకుని కూడా తమతో పాటు తీసుకొనిపోయారు. తర్వాత వారు లాయిషుకి వచ్చారు. లాయిషులో నివసిస్తున్న వారి మీద దాడిచేశారు. ఆ మనుష్యులు శాంతముగా ఉన్నారు. వారు దాడిని ఎదురుచూడలేదు. దానుకు చెందిన మనుష్యులు వారిని తమ కత్తులతో చంపివేశారు. తర్వాత నగరాన్ని కాల్చివేశారు.
అందువల్ల ఐదుగురు వెళ్లిపోయారు. లాయిషు నగరానికి వారు వచ్చారు. ఆ నగరంలోని ప్రజలు భద్రత కలిగి ఉండడం వారు చూశారు. వారిని సీదోను ప్రజలు పరిపాలించారు. ప్రతిదీ ప్రశాంతంగా శాంతియుతంగా ఉండి, ప్రజలకు అంతా సమృద్ధిగా ఉండినది. తమకు హాని కలిగించే విరోధులు దగ్గరలో వారికి లేరు. పైగా సీదోను నగరానికి దూరంగా వారు నివసిస్తున్నారు. ప్రజలతో ఎలాంటి ఒడంబడికలూ చేసుకోలేదు.