యెషయా 47:6 - పవిత్ర బైబిల్6 “నేను నా ప్రజల మీద కోపగించాను. ఈ ప్రజలు నావాళ్లే కానీ నేను కోపగించాను, అందుచేత నేను వాళ్లకు ప్రాముఖ్యం లేకుండా చేశాను. నేను వాళ్లను నీకు అప్పగించాను. నీవు వారిని శిక్షించావు. నీవు వారికి ఎలాంటి దయా చూపించలేదు. వాళ్లు ముసలి వాళ్ల కోసం చాలా కష్టపడి పనిచేసేట్టు నీవు చేశావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్ధులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నా ప్రజల మీద కోపంతో నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించాను. కాని నువ్వు వారి మీద కనికరం చూపలేదు. వృద్ధుల మీద నీ బరువైన కాడిని మోపావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నా ప్రజల మీద నేను కోప్పడి నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచాను; నేను వారిని నీ చేతికి అప్పగించాను, నీవు వారిమీద జాలి చూపలేదు. వృద్ధుల మీద కూడా నీవు చాలా బరువైన కాడిని ఉంచావు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నా ప్రజల మీద నేను కోప్పడి నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచాను; నేను వారిని నీ చేతికి అప్పగించాను, నీవు వారిమీద జాలి చూపలేదు. వృద్ధుల మీద కూడా నీవు చాలా బరువైన కాడిని ఉంచావు. အခန်းကိုကြည့်ပါ။ |
కాని యెహోవా ప్రవక్తలలో ఒకడు అక్కడ వున్నాడు. ఈ ప్రవక్త పేరు ఓదేదు. సమరయకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలు సైన్యాన్ని ఓదేదు కలిశాడు. ఇశ్రాయేలు సైన్యంతో ఓదేదు యిలా అన్నాడు: “మీ పూర్వీకులు ఆరాధించిన దేవుడైన యెహోవా యూదా ప్రజలపట్ల కోపంగా వున్న కారణంగా వారిని మీరు ఓడించగలిగేలా చేశాడు. మీరు యూదా ప్రజలను నీచమైన విధంగా చంపి, శిక్షించారు. ఇప్పుడు యెహోవా మీపట్ల కోపంగా వున్నాడు.
అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు. బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధులను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు.
“నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను. ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు. నా శత్రువులంతా నా కష్టాల గురించి విన్నారు. విని సంతోషపడ్డారు. నీవు నాకు ఈ శిక్ష విధించినందుకు వారు సంతోషించారు. నీవు ప్రకటించిన ఆ రోజును ఇప్పుడు రప్పించుము. ఆ రోజున నా శత్రువులు ఇప్పుడు నేనున్న స్థితికి వచ్చేలా చేయుము.
ఇశ్రాయేలు వంశంవారితో మాట్లడమని ఆయన నాకు చెప్పాడు. నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: ‘చూడండి, నేను నా పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తాను. మీరా స్థలాన్ని చూచి గర్వపడుతున్నారు. దానిని శ్లాఘిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ స్థలాన్ని చూడాలని మీరు ఉబలాట పడుతూ వుంటారు. మీరు నిజంగా ఆ స్థలమంటే ఇష్టపడుతూ వున్నారు. కాని నేనాస్థలాన్ని నాశనం చేస్తాను. మీరు మీ వెనుక వదిలిపెట్టిన మీ పిల్లలంతా యుద్ధంలో చంపబడతారు.
నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది. ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు. అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను. దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను. నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు. నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి. కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.