యెషయా 47:12 - పవిత్ర బైబిల్12 నీ జీవితాంతం నీవు కష్టపడి పనిచేశావు. ఉపాయాలు, మంత్రాలు నేర్చుకొన్నావు. కనుక నీ ఉపాయాలు, మంత్రాలు ప్రయోగించటం ప్రారంభించు. ఒకవేళ ఆ ఉపాయాలు నీకు సహాయపడతాయేమో! ఒకవేళ నీవు ఎవరినైనా భయపెట్టగలుగుతావేమో. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 “నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో బహుశ నీవు విజయం సాధిస్తావేమో, బహుశ నీవు భయం కలిగించగలవేమో. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 “నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో బహుశ నీవు విజయం సాధిస్తావేమో, బహుశ నీవు భయం కలిగించగలవేమో. အခန်းကိုကြည့်ပါ။ |
కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి?