యెషయా 42:22 - పవిత్ర బైబిల్22 అయితే ప్రజలను చూడండి ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు. యువకులంతా భయపడ్తున్నారు. వారు చెరలో బంధించబడ్డారు. మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు. వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు. ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు. “దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారువారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అయితే ఈ ప్రజలు దోపిడీకి గురయ్యారు. వారంతా గుహల్లో చిక్కుకుపోయారు, వారిని బంధకాల్లో ఉంచారు. వారు దోపుడు పాలైనప్పుడు వారినెవరూ విడిపించలేదు. అపహరణకు గురైనప్పుడు “వారిని తిరిగి తీసుకురండి” అని ఎవరూ చెప్పలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 కాని ఈ ప్రజలు దోచుకోబడి కొల్లగొట్టబడ్డారు, వారందరూ గుహల్లో చిక్కుకున్నారు, చెరసాలలో దాచబడ్డారు. వారు దోచుకోబడ్డారు వారిని విడిపించే వారెవరూ లేరు. వారు దోపుడు సొమ్ముగా చేయబడ్డారు, “వారిని వెనుకకు పంపండి” అని చెప్పేవారు ఎవరూ లేరు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 కాని ఈ ప్రజలు దోచుకోబడి కొల్లగొట్టబడ్డారు, వారందరూ గుహల్లో చిక్కుకున్నారు, చెరసాలలో దాచబడ్డారు. వారు దోచుకోబడ్డారు వారిని విడిపించే వారెవరూ లేరు. వారు దోపుడు సొమ్ముగా చేయబడ్డారు, “వారిని వెనుకకు పంపండి” అని చెప్పేవారు ఎవరూ లేరు. အခန်းကိုကြည့်ပါ။ |
కోరెషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని నేనే అతనికి ఇచ్చాను. అతని పని నేను సులభం చేస్తాను. కోరెషు నా పట్టణాన్ని మరల నిర్మిస్తాడు. అతడు నా ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. కోరెషు నా ప్రజలను నాకు అమ్మడు. అతడు ఈ పనులు చేసేందుకు అతనికి నేనేమీ చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రజలు విమోచించబడతారు. దానికి నాకేమీ ఖర్చుకాదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”
యూదా రాజైన యెహోయాకీను బబులోనులో ముప్పది ఏడు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. యెహోయాకీను కారాగారవాసంలో ముప్పది ఏడవ సంవత్సరం జరుగుతూ ఉండగా బబులోను రాజైన ఎవీల్మెరోదకు అతని పట్ల మిక్కిలి కనికరం చూపాడు. ఆ సంవత్సరంలో యెహోయాకీనును అతడు చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మెరోదకు బబులోనుకు రాజు అయిన మొదటి సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు.