Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 40:24 - పవిత్ర బైబిల్

24 ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు. దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి. గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 వారు నాటబడగనే విత్తబడగనేవారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 చూడు, వారు నాటారో లేదో, వారు పాతిపెట్టారో లేదో, వారి కాండం భూమిలో వేరు తన్నిందో లేదో, ఆయన వారి మీద ఊదీ ఊదగానే వారు వాడిపోతారు. సుడిగాలి పొట్టును ఎగర గొట్టినట్టు ఆయన వారిని ఎగరగొడతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 వారు నాటబడిన వెంటనే, వారు విత్తబడిన వెంటనే, వారి భూమిలో వేరు పారకముందే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు. సుడిగాలికి పొట్టు ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 వారు నాటబడిన వెంటనే, వారు విత్తబడిన వెంటనే, వారి భూమిలో వేరు పారకముందే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు. సుడిగాలికి పొట్టు ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 40:24
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి!


అందువల్ల యెహూ యెజ్రెయేలులో నివసించే అహాబు వంశీయులనందరినీ చంపివేశాడు. యెహూ ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగలలేదు.


గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గాలి ఊకను ఎగురగొట్టినట్లు దేవుడు దుర్మార్గులను ఎగురగొట్టి వేస్తాడా?


దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది. దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది.


అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.


కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.


గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె ఆ ప్రజలను చేయుము. గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.


గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.


బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.


ఒకనాడు మీరు మీ ద్రాక్ష వల్లులను నాటి, వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోతకాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపేస్తుంది.


ప్రజలు ఆ అలల్లా ఉంటారు. దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు. ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు.


తోపెతు చాలాకాలంగా సిద్ధం చేయబడి ఉంది. అది రాజుకోసం సిద్ధంగా ఉంది. అది చాలా లోతుగా వెడల్పుగా చేయబడింది. అక్కడ చాలా పెద్దగా కట్టెలు పేర్చి ఉన్నాయి. అగ్ని ఉంది. మరియు యెహోవా ఊపిరి (ఆత్మ) అగ్ని గంధక ప్రవాహంలా వచ్చి, దానిని కాల్చివేస్తుంది.


చూడండి, అష్షూరుకు విరోధంగా నేను ఒక ఆత్మను పంపిస్తాను. అష్షూరు రాజు యొక్క దేశానికి ఒక ప్రమాదం గూర్చి హెచ్చరిక చేస్తూ అతనికి సమాచారం అందుతుంది. కనుక అతడు తిరిగి తన దేశం వెళ్లిపోతాడు. ఆ సమయంలో అతని స్వంత దేశంలోనే నేను అతణ్ణి ఒక ఖడ్గంతో చంపేస్తాను.’”


యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది. ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది. సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.


వాటిని గాలిలో విసిరివేస్తావు. గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది. అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.


ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు? మంచితనం నాతో కూడ నడుస్తుంది. అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు. వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు. వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.


యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి: ‘అతడు పిల్లలు లేని వానితో లెక్క! తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు. అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు. అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.’”


ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది! యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది! ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.


ఇశ్రాయేలు తన సోదరుల మధ్య పెరుగుతాడు. కాని, శక్తివంతమైన తూర్పుగాలి వీస్తుంది. యెహోవా గాలి ఎడారినుంచి వస్తుంది. అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది. అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది. (ఇశ్రాయేలు) సంపదలో విలువైన వాటన్నింటినీ గాలి ఎగరేసుకుపోతుంది.


అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. ఆ పొగమంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యం తూర్పార పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.


అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు. నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన, చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను నేను తీసివేస్తాను. నేను నీ కొరకు నీ సమాధిని తయారు చేస్తున్నాను. నీవు ముఖ్యుడవు కావు!”


సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే. దానిని మీరు ఇంటికి తెచ్చినప్పుడు, నేను గాలిని పంపించి ఎగురగొడతాను. ఎందుకని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు.


ఇతర దేశాలను వారి మీదికి ఒక తుఫానులా తీసుకువస్తాను. వారెవరో వీరికి తెలియదు; కాని వారు దేశంలో తిరిగాక అది నాశనమై పోతుంది. రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”


యెహోవా వారికి కన్పిస్తాడు. ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు. అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకు పోతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ