Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 34:10 - పవిత్ర బైబిల్

10 అగ్ని రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ ఆర్పివేయలేరు. ఎదోమునుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ ప్రయాణం చేయరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అది రేయింబగళ్లు ఆరక యుండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగానుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అది రాత్రీ, పగలూ ఆరిపోకుండా ఉంటుంది. దాని పొగ ఎల్లప్పుడూ రేగుతూ ఉంటుంది. అది తరతరాలు పాడుగా ఉంటుంది. దానిలో గుండా ఇక ఎవ్వరూ ఎన్నటికీ ప్రయాణించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అది రాత్రింబగళ్ళు ఆరిపోదు; దాని పొగ నిత్యం లేస్తూనే ఉంటుంది. అది తరతరాల వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది; దానిగుండా ఎవ్వరూ ఎప్పటికీ ప్రయాణించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అది రాత్రింబగళ్ళు ఆరిపోదు; దాని పొగ నిత్యం లేస్తూనే ఉంటుంది. అది తరతరాల వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది; దానిగుండా ఎవ్వరూ ఎప్పటికీ ప్రయాణించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 34:10
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

శక్తిమంతులైన ప్రజలు ఎండిపోయిన చిన్న చెక్క ముక్కల్లా ఉంటారు. ఆ ప్రజలు చేసే పనులు నిప్పు రాజబెట్టే నిప్పురవ్వల్లా ఉంటాయి. శక్తిమంతులైన ప్రజలూ, వారు చేసే పనులూ కాలిపోవటం మొదలవుతుంది. ఆ అగ్నిని ఎవరూ ఆర్పివేయలేరు.


కానీ బబులోను అందంగా ఇక ఉండదు. భవిష్యత్తులో ప్రజలు యికమీదట అక్కడ నివసించరు. అరబ్బులు అక్కడ వారి గుడారాలు వేయరు. గొర్రెలను అక్కడ మేపేందుకు కాపరులు వాటిని అక్కడికి తీసుకొనిరారు.


చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు.


వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గితగీసి, వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి.


“ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. మరియు పట్టణం బయటకు వెళ్తే నాకు విరోధంగా పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. ఆ శవాలు పురుగులు పట్టి ఉంటాయి. ఆ పురుగులు ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు ఆ శవాలను కాల్చివేస్తాయి మరియు ఆ జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.”


సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.


కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”


మనుష్యుడే గాని, జంతువే గాని ఈజిప్టు దేశం గుండా వెళ్లరు.


ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది. ప్రతీదీ దోచుకోబడింది. నగరం నాశనం చేయబడింది! ప్రజలు వారి ధైర్యాన్ని కోల్పోయారు. వారి హృదయాలు భయంతో వికలమవుతున్నాయి. వారి మోకాళ్ళు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. వారి శరీరాలు వణుకుతున్నాయి వారి ముఖాలు భయంతో వెలవెల పోతున్నాయి.


ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు.


వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి! కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ