Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 33:9 - పవిత్ర బైబిల్

9 దేశం వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 దేశం దుఖిస్తుంది. క్షీణించి పోతుంది. లెబానోను కలవరపడి వాడిపోతుంది. షారోను ఎడారిలా ఉంది. బాషాను, కర్మెలు తమ చెట్ల ఆకులు రాలుస్తున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 33:9
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు. ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు.


నేను షారోనులోని గులాబి పువ్వును. లోయలలోని సుగంధ పుష్పాన్ని.


యెహోవా తన గొడ్డలితో అరణ్యం నరికివేస్తాడు. లెబానోనులో మహా వృక్షాలు (ప్రముఖ వ్యక్తులు) పడిపోతాయి.


నీవు ఒక దుష్ట రాజువు కానీ ఇప్పుడు నీ పని అయిపోయింది. చివరికి తమాల వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. లెబానోను దేవదారు వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. ఆ చెట్లు అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు. కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు. అతడు మళ్లీ ఎన్నటికీ నిలబడడు.”


గర్విష్ఠులైన ఆ మనుష్యులు లెబానోను కేదారు వృక్షాల్లా ఉంటారు. వారు బాషాను మహా మస్తకి వృక్షాల్లా ఉంటారు. కానీ ఆ మనుష్యులను దేవుడు శిక్షిస్తాడు.


చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు.


అరీయేలును నేను శిక్షించాను ఆ పట్టణం దుఃఖంతో, ఏడ్పుతో నిండిపోయింది. కానీ అది ఎప్పటికీ నా అరీయేలే.


పట్టణ ద్వారాల దగ్గర సమావేశ స్థలాల్లో ఏడ్పు, దుఃఖం ఉంటుంది. దొంగలు, బందిపోటులు సర్వం దోచుకొన్న స్త్రీలాగ యెరూషలేము శూన్యంగా కూర్చుని ఉంటుంది. ఆమె నేల మీద కూర్చుని ఏడుస్తుంది.


అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.


యెషయా ఇంకా ఇలా చెప్పాడు, నా ప్రభువు యెహోవాను గూర్చి చెడు సంగతులు చెప్పడానికి నీవు నీ సేవకులను వాడుకొన్నావు. నీవు ఇలా అన్నావు: “నేను చాలా శక్తిమంతుణ్ణి. నాకు ఎన్నెన్నో రథాలు ఉన్నాయి. లెబానోను మహాపర్వతాల మీదుగా దాటించి నా రథాలను నేను తీసుకొని వచ్చాను. లెబానోను మహా వృక్షాలను (సైన్యాలను) అన్నింటినీ నేను నరికివేశాను.


అప్పుడు షారోను లోయ గొర్రెలకు పొలం అవుతుంది. ఆకోరు లోయ పశువులు విశ్రాంతి తీసుకొనే చోటు అవుతుంది. ఈ సంగతులన్నీ నా ప్రజలకోసం, నాకోసం వెదకే ప్రజలకోసమే.


“‘కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను. అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు. అతడు తిని, తృప్తి పొందుతాడు. ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.’”


అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.


ఆమోసు ఇలా అన్నాడు: “యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు. ఆయన గంభీర స్వరం యెరూషలేమునుండి గర్జిస్తుంది. గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండిపోతాయి. కర్మెలు పర్వతం సహితం ఎండిపోతుంది.”


కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు. నీకు చెందిన ప్రజాసమూహాన్ని పాలించు. ఆ మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు పర్వతం మీదనూ ఒంటరిగా ఉంటుంది. గతంలో మాదిరి ఆ మంద బాషానులోనూ, గిలాదులోనూ నివసిస్తుంది.


యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది. ఆయన నదులన్నీ ఇంకిపోయేలా చేస్తాడు! బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి, నశించి పోతాయి. లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి.


లుద్ద, షారోను పట్టణాల్లో నివసిస్తున్నవాళ్ళంతా ఐనెయను చూసి ప్రభువునందు విశ్వాసముంచారు.


తర్వాత అప్పట్లో ఓగుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకొన్నాము. ఓగు ప్రజల పట్టణాలు అన్నింటినీ, బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతం అంతటిలో 60 పట్టణాలను మనం స్వాధీనం చేసుకొన్నాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ