యెషయా 30:27 - పవిత్ర బైబిల్27 చూడండి! చాలా దూరం నుండి యెహోవా పేరు వస్తోంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘాలతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు కోపంతో నిండి ఉంది, ఆయన నాలుక మండుతోన్న మంటలా ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతోకూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 చూడండి! ఆయన ఆగ్రహంతో మండిపోతూ దట్టమైన పొగతో యెహోవా పేరు దూరం నుండి వస్తూ ఉంది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి పోయాయి. ఆయన నాలుక దహించే అగ్ని జ్వాలలా ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి. మీ హృదయాలను మార్చుకోండి యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీలో పరివర్తన రాకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ అగ్ని జ్వాలల్ని ఎవ్వరూ ఆర్పలేరు! అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు చేసిన పాపకార్యాలవల్లనే ఇదంతా జరుగుతుంది.”
యెహోవా చెప్పాడు: “కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాలనుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడుకొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది!