Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 30:13 - పవిత్ర బైబిల్

13 ఈ విషయాల్లో మీరు దోషులు గనుక మీరు బీటలు వారిన గోడల్లా ఉన్నారు. ఆ గోడ పడిపోయి చిన్న చిన్న ముక్కలైపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 కాబట్టి ఈ పాపం మీకు బీటలు వారి, ఉబ్బి పోయి, ఒక్క క్షణంలో కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గోడలా ఉంటుంది. అది ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పడిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఈ పాపం మీకు బీటలు తీసి ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఈ పాపం మీకు బీటలు తీసి ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 30:13
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

మిగిలిన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. నగర ప్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై ఏడువేల మంది సైనికులు చనిపోయారు. బెన్హదదు కూడ నగరానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు.


యోబూ, ధనం నీ చేత తప్పు చేయించనీయకుండును గాక. విస్తారమైన ధనాశ చూపించినందువల్ల మోసపోవద్దు.


ఇంకెంత కాలం వారు నా మీద దాడి చేస్తూ ఉంటారు? నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను. పడిపోతున్న కంచెలా ఉన్నాను.


ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి పథకాలు వేస్తున్నారు. వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు. బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబుతారు, కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.


ఒక మనిషి మొండివాడై, అతడు చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆకస్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు.


కాని అతడు శిక్షించబడతాడు. కష్టం అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం చేయరు.


సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: “మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం క్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.


యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు. ప్రపంచంలోని మనుష్యులు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది భూమి ఇక ఎన్నటికీ చనిపోయిన వాళ్లను కప్పెట్టదు.


అక్కడ చాలామంది క్రొత్తవాళ్లు దుమ్ముకణాల్లా ఉన్నారు. గాలికి ఎగిరే పొట్టులాంటి క్రూరమైన మనుష్యులు చాలామంది అక్కడ ఉన్నారు.


ఆ సమయంలో చంద్రకాంతి సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది. సూర్యకాంతి ఇప్పటికంటె ఏడు రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్కరోజు సూర్య కాంతి నిండు వారపు కాంతిలా ఉంటుంది. యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారు తిన్న దెబ్బల బాధను స్వస్థపరచిన తరువాత ఈ సంగతులు జరుగుతాయి.


“అయితే నీకు కష్టాలు వస్తాయి. అది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. కాని నాశనం వచ్చేస్తుంది. ఆ కష్టాలను ఆపుజేసేందుకు నీవు ఏమీ చేయలేవు. నీవు త్వరగా నాశనం చేయబడతావు. నీకు ఏమి జరిగిపోయిందో కూడా నీకు తెలియదు.


“జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం క్రిందట నేను మీకు చెప్పాను. వాటిని గూర్చి నేను మీకు చెప్పాను. అకస్మాత్తుగా ఆ సంగతులు సంభవించేట్టు నేను చేశాను.


ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. కానీ క్రొత్త పట్టణాలు నిర్మించబడతాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “త్రోవలు, ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు.


మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే. యెహోవా ఇలా చెప్పాడు, ‘మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.’”


వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది.


“నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ