Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 27:7 - పవిత్ర బైబిల్

7 యెహోవా తన ప్రజలను ఎలా శిక్షిస్తాడు? గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెహోవా కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, అనేక మందిని చంపేస్తాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 యాకోబు, ఇశ్రాయేలును వాళ్ళు కొట్టారు. వాళ్ళను యెహోవా కొట్టాడు. వాళ్ళను కొట్టినట్టు యెహోవా యాకోబు, ఇశ్రాయేలును కొట్టాడా? యాకోబు, ఇశ్రాయేలును చంపిన వాళ్ళని ఆయన చంపినట్టు ఆయన యాకోబు, ఇశ్రాయేలులను చంపాడా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, యెహోవా ఇశ్రాయేలును కొట్టారా? ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు ఇశ్రాయేలును చంపరా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, యెహోవా ఇశ్రాయేలును కొట్టారా? ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు ఇశ్రాయేలును చంపరా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 27:7
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెరూషలేముకు, సీయోను కొండకు నా ప్రభువు చేయదలచిన వాటిని చేయటం ముగిస్తాడు. అప్పుడు యెహోవా అష్షూరును శిక్షిస్తాడు. అష్షూరు రాజు చాలా గర్విష్ఠి. అతడు గర్వం చేత చాలా చెడ్డ పనులు చేశాడు. అందుచేత దేవుడు అతణ్ణి శిక్షిస్తాడు.


ఇశ్రాయేలు వెలుగు (దేవుడు) అగ్నిలా ఉంటాడు. ఆ పరిశుద్ధుడు ఒక జ్వాలలా ఉంటాడు. మొట్టమొదట పొదలను, ముళ్లకంపలను కాల్చేసే అగ్నిలా ఆయన ఉంటాడు.


ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు. తెల్లవారే సరికి ఏమీ మిగలదు. కనుక మన శత్రువులకు ఏమీ లభించదు. వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు.


ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి. దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది. ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.” ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు.


అష్షూరు యెహోవా స్వరం విన్నప్పుడు భయపడుతాడు. యెహోవా అష్షూరును దండంతో కొడతాడు.


నిజమే, అష్షూరు ఖడ్గం చేత ఓడించబడుతుంది, కానీ ఆ ఖడ్గం మానవ ఖడ్గం కాదు. అష్షూరు ఓడించబడుతుంది. కానీ ఆ నాశనం మనిషి ఖడ్గం ద్వారా జరగదు. అష్షూరు దేవుని ఖడ్గం నుండి పారిపోతుంది. కానీ యువకులు పట్టుబడి, బానిసలవుతారు.


వారి భద్రతా స్థలం నాశనం చేయబడుతుంది. వారి నాయకులు ఓడించబడి, వారి పతాకాన్ని విడిచిపెడ్తారు. ఆ విషయాలన్నీ యెహోవా చెప్పాడు. యెహోవా అగ్ని (బలిపీఠం) సీయోను మీద ఉంది. యెహోవా కొలిమి (బలిపీఠం) యెరూషలేములో ఉంది.


సొదొము, గొమొర్రా నగరాలను, వాటి చుట్టుపట్ల పట్టణాలను దేవుడు పూర్తిగా నాశనం చేశాడు. ఇప్పుడా పట్టణాలలో ఎవ్వరూ నివసించరు. అదేరీతి, బబులోనులో ఎవ్వరూ నివసించరు. అక్కడ నివసించటానికి ప్రజలు అసలు వెళ్లరు.”


కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. కల్దీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను. యూదా, నీ కన్నుల ఎదుటనే నేను వారికి తగిన శాస్తి చేస్తాను.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.


అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు. నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన, చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను నేను తీసివేస్తాను. నేను నీ కొరకు నీ సమాధిని తయారు చేస్తున్నాను. నీవు ముఖ్యుడవు కావు!”


నీనెవే, నీవు తీవ్రంగా దెబ్బతిన్నావు. నీ గాయాన్ని ఏదీ మాన్పలేదు. నీ వినాశాన్ని గురించి విన్న ప్రతివాడూ చప్పట్లు చరుస్తాడు. వారంతా సంతోషంగా ఉంటారు! ఎందుకంటే, నీవు ఎల్లప్పుడూ కలుగజేసిన బాధను వారంతా అనుభవించారు!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ