Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 26:16 - పవిత్ర బైబిల్

16 యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు. నీవు ప్రజలను శిక్షించినప్పుడు వారు మౌన ప్రార్థనలు నీకు చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారిమీద పడినందునవారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి యెహోవా, ప్రసూతికాలము సమీపింపగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 యెహోవా, కష్టాల్లో ఉన్నప్పుడు వారు నీ వైపు చూశారు. నువ్వు వాళ్లకి శిక్ష విధించినప్పుడు కీడుకువ్యతిరేకంగా నీకు ప్రార్థనలు వల్లించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; మీరు వారిని శిక్షించినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; మీరు వారిని శిక్షించినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 26:16
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.


యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది. వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.


కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము. నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం, ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం. అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.


“ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి! నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”


నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు, నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.


దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలినవారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు. వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు.


నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు. నేను వారికి జవాబు ఇస్తాను. వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.


ఈ మనుష్యులు యెషయాతో చెప్పారు: “ఈ రోజు దుఃఖం, విచారం వ్యక్తం చేసే ప్రత్యేక సంతాపదినంగా ఉండాలని హిజ్కియా రాజు ఆదేశించాడు. ఇది చాలా విచారకరమైన రోజుగా ఉంటుంది. ఆ రోజు శిశువు జన్మించాల్సినప్పటికీ, తల్లిలో నుండి బయటకు వచ్చే శక్తి లేక అది బయటకు రాని రోజులా అది ఉంటుంది.


ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, ‘నీవే మాకు జన్మనిచ్చావు’ అంటారు. ఆ ప్రజలంతా అవమానం పొందుతారు. ఆ ప్రజలు నావైపుకు చూడరు. వారు విముఖులై నాకు వెన్ను చూపుతారు. కాని యూదాప్రజలు కష్టాల పాలైనప్పుడు, ‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.


“ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు. ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీవున్నట్లుగా వుంది. కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు సురక్షితం అనుకుంటున్నావు. కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు. స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”


అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను.


లెమ్ము! రాత్రిళ్లు రోదించు! రాత్రిళ్లు ప్రతి ఝామున దుఃఖించు! ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు! యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు! నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయుము. నీ పిల్లలు బ్రతికేలా చేయుమని ఆయనను ప్రాధేయపడుము. ఆకలితో అలమటించి సొమ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను అర్థించుము. ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు.


ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు నాకోసం వారు వెదుకుతూ వచ్చేంత వరకు నేను నా స్థలానికి వెళ్లిపోతాను. అవును, తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”


అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తిరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. కాని వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.


ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి ఈ పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ఆ ప్రజల కోసం మోషే ప్రార్థించాడు.


“నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితితో ఉండి పశ్చాత్తాపం చెందు.


కానీ ఇశ్రాయేలు ప్రజలు, “మేము పాపం చేశాము. మమ్మల్ని నీవు ఏమి చేయాలనుకొంటే అలాగే చేయి. కానీ ఈ వేళ నీవు మమ్మల్ని రక్షించు” అని యెహోవాను అడిగారు.


“లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ