యెషయా 25:2 - పవిత్ర బైబిల్2 పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీయమైన కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం. కానీ ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే విదేశీ భవనం నాశనం చేయబడింది. అది ఎన్నటికీ కట్టబడదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నీవు శత్రువుల నగరాన్ని దిబ్బగా చేశావు. ప్రాకారాలున్న పట్టణాన్ని శిథిలంగా చేశావు. అన్యుల కోటను పట్టణంగా మళ్ళీ ఉండకుండా చేశావు. అది మళ్ళీ ఎప్పుడూ నిర్మాణం కాకుండా చేశావు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా, విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు; అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా, విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు; అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు. အခန်းကိုကြည့်ပါ။ |
అందుచేత తూరు ప్రజలు, “బబులోను ప్రజలు మాకు సహాయం చేస్తారు” అంటున్నారు. కానీ కల్దీయుల దేశం చూడండి. బబులోను ఇప్పుడు ఒక దేశం కాదు. బబులోను మీద అష్షూరు దాడి చేసి దాని చుట్టూ యుద్ధ గోపురాలు కట్టింది. అందమైన గృహాలనుండి సైన్యం సమస్తం దోచుకొంది. అష్షూరు బబులోనును అడవి మృగాలకు స్థావరంగా చేసింది బబులోనును వారు శిథిలాలుగా మార్చేశారు.
“‘అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది నీవు వినలేదా? అష్షూరు రాజా, దేవుడనైన నేనే ఆ సంగతులను చేశానని నిశ్చయంగా నీవు ఎప్పుడో విన్నావు. చాలాకాలం క్రిందట నేను అష్షూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను. మిగిలిన ఇతర పట్టణాలను నిన్ను నాశనం చేయనిచ్చాను. నా పనిలో నేనే నిన్ను వాడుకొని, ఆ పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేశాను.