Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 25:12 - పవిత్ర బైబిల్

12 ప్రజల ఎత్తయిన గోడల, భద్రతా స్థలాలు అన్నింటిని యెహోవా నాశనం చేస్తాడు. యెహోవా వాటిని నేల ధూళిలో పార వేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 మోయాబూ, నీ ప్రాకారాలను, ఎత్తయిన కోటలను ఆయన కూల్చి వేస్తాడు. వాటిని నేలకు అణగదొక్కి ధూళి పాలు చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మోయాబూ, నీ ఎత్తైన కోటలను ఆయన పడగొడతారు. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిలో పడవేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మోయాబూ, నీ ఎత్తైన కోటలను ఆయన పడగొడతారు. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిలో పడవేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 25:12
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

“బబులోనును నేను మార్చేస్తాను. ఆ స్థలం మనుష్యుల కోసం కాదు, జంతువుల కోసమే. ఆ స్థలం నీ టి మడుగు అవుతుంది. బబులోనును తుడిచి వేయటానికి ‘నాశనం అనే చీపురును’ నేను ప్రయోగిస్తాను” అని యెహోవా చెప్పాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.


ఇది మోయాబును గూర్చి విచారకరమైన సందేశం: ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. ఆ రాత్రి పట్టణం నాశనం చేయబడింది. ఒక రాత్రి కిర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. ఆ రాత్రే పట్టణం నాశనం చేయబడింది.


ఆ గర్విష్ఠులు ఎత్తయిన గోపురాల్లా చాలా బలమైన గోడల్లా ఉన్నారు. కానీ ఆ ప్రజలను దేవుడు శిక్షిస్తాడు.


పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీయమైన కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం. కానీ ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే విదేశీ భవనం నాశనం చేయబడింది. అది ఎన్నటికీ కట్టబడదు.


అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు. అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు అది ధూళిలో పడిపోతుంది.


ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నెబో పర్వతానికి చేటు కలుగుతుంది. నెబో పర్వతం నాశనమవుతుంది. కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది. అది పట్టుబడుతుంది. బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది. అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.


సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను యొక్క మందమైన, బలమైన గోడ కూలగొట్టబడుతుంది. దాని ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి. బబులోను ప్రజలు కష్టపడి పనిచేస్తారు. కాని అది వారికి సహాయపడదు! నగరాన్ని రక్షించటంలో వారు మిక్కిలి అలసిపోతారు. కాని వారు ఎగసేమంటల్లో కేవలం సమిధలవుతారు!”


అప్పుడు, ‘ఇదే రీతిగా బబులోను మునిగిపోతుంది. బబులోను మరి పైకి లేవదు! నేను ఇక్కడ కలుగజేసే భయంకరమైన పరిణామాల కారణంగా బబులోను మునిగిపోతుంది’” అని చెప్పు. యిర్మీయా మాటలు సమాప్తమాయెను.


యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా మింగివేశాడు. కనికరం లేకుండా ఆయన వాటిని మింగివేశాడు. ఆయన తన కోపంలో యూదా కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం చేశాడు. యూదా రాజ్యాన్ని, దాని పాలకులను యెహోవా నేలకు పడదోసినాడు. ఆయన రాజ్యాన్ని నాశనం చేశాడు.


నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు. నీ గొప్పతనం యొక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది. అందువల్ల నిన్ను క్రిందికి పడదోశాను. ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.


ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి.


అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు: “గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది. అది మళ్ళీ కనిపించదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ