Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 22:16 - పవిత్ర బైబిల్

16 నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?” అని ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 –ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 “ఇక్కడ నీకేం పని? ఇక్కడ సమాధి తొలిపించుకోడానికి అసలు నువ్వెవరు? ఎత్తయిన స్థలంలో సమాధిని తొలిపించుకుంటున్నావు. రాతిలో నీ కోసం నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 నీవిక్కడేం చేస్తున్నావు నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? నీకు ఎవరు అనుమతి ఇచ్చారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 నీవిక్కడేం చేస్తున్నావు నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? నీకు ఎవరు అనుమతి ఇచ్చారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 22:16
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

‘నా తండ్రి మరణ ఘడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేశాను. కనాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేశాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న గుహ. కనుక దయచేసి నేను వెళ్లి, నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను’” అన్నాడు యోసేపు.


అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో రాజు లోయలో, ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది.


దావీదు నగరంలో తనకై తాను సిద్ధపర్చుకున్న సమాధిలోనే ప్రజలు ఆసాను వుంచారు. ఆసాకు గౌరవ సూచకంగా సుగంధ దినుసులతోను, పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు వుంచి, అతనిని దహించారు.


భూమి మీద బ్రతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.


భూమిమీద ప్రతి రాజూ ఘనంగా మరణించాడు. ప్రతి రాజుకూ స్వంత సమాధి ఉంది.


అయితే నీవు, దుష్ట రాజువి నీ సమాధిలోనుండి త్రోసి వేయబడ్డావు. నరకబడిన చెట్టు కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పారవేయబడింది. నీవు యుద్ధంలో చచ్చిపడిన వానిలా ఉన్నావు. మిగతా సైనికులు వాని మీద నడిచారు. ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు. నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు.


“ఓ మనిషీ, యెహోవా నిన్ను చితక గొట్టేస్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుట్టేసి, చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరోదేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.” యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో నీ రథాలు ఎన్నదగినవిగా కనబడవు.


ఇప్పుడు చూడండి ఏమయిందో! మరో రాజ్యాం నా ప్రజలను తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న ఆ రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు ఈ రాజ్యం ఏమీ చెల్లించలేదు. ఈ రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, వారిని చూచి నవ్వుతుంది. ఆ మనుష్యులు ఎప్పుడూ నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.”


లేచి వెళ్లిపొండి! ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు! మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది!


ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ