యెషయా 18:4 - పవిత్ర బైబిల్4 యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయబడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు –ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ ములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. “వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా నాతో చెప్పే మాట ఇది: “సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా, వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా, నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా నాతో చెప్పే మాట ఇది: “సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా, వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా, నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.” အခန်းကိုကြည့်ပါ။ |
ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.
కాని యెహోవా చెప్పేదేమంటే, “నీ ప్రజలు మరణించారు కానీ వారు మళ్లీ లేస్తారు నా ప్రజల శరీరాలు మరణం నుండి లేస్తాయి. భూమిలోని మృతులు లేచి, సంతోషిస్తారు. నిన్ను కప్పియున్న మంచు, ఒక క్రొత్త రోజు వెలుతురులా ఉంది. ఒక క్రొత్త కాలం వస్తోందని అది సూచిస్తుంది ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.”
మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు శాశ్వతంగా జీవించేవాడు, పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు: “నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను. అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను. ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను. హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.