యెషయా 18:2 - పవిత్ర బైబిల్2 ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది. వేగంగా పోయే సందేశహరులు, ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు. (ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం. వారు బలంగల రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది. నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు). အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ లలో రాయబారులను పంపుచున్నది –వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు పోవుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అది సముద్రంపై నీళ్ళ మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపిస్తూ ఉంది. వేగిరపడే వార్తాహరులారా! వెళ్ళండి. నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళండి! చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేసే ఆ బలమైన జనాల దగ్గరకూ, నదులు విభజించే వాళ్ళ దేశానికీ వెళ్ళండి! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అది సముద్ర మార్గంలో నీటి మీద జమ్ము పడవలలో దూతలను పంపుతుంది. తొందరపడే దూతలారా! వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు, దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు, నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అది సముద్ర మార్గంలో నీటి మీద జమ్ము పడవలలో దూతలను పంపుతుంది. తొందరపడే దూతలారా! వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు, దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు, నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి. အခန်းကိုကြည့်ပါ။ |
అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు చేసి, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను పెట్టింది.
ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.