యెషయా 17:14 - పవిత్ర బైబిల్14 ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు. తెల్లవారే సరికి ఏమీ మిగలదు. కనుక మన శత్రువులకు ఏమీ లభించదు. వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలువారికి పట్టు గతి యిదే. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 సాయంత్రం, చూడండి, భయోత్పాతం! ఉదయం కాకుండానే వాళ్ళు కనిపించకుండా పోతారు. మమ్మల్ని దోచుకునే వాళ్లకి పట్టే గతి ఇదే. మా సంపదను దొంగతనం చేసేవాళ్ళకి దక్కేది ఇదే. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 సాయంకాలంలో ఆకస్మిక భయం! ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 సాయంకాలంలో ఆకస్మిక భయం! ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే. အခန်းကိုကြည့်ပါ။ |
మీరు యుద్ధం చేసి ప్రజల దగ్గర్నుండి దొంగిలిస్తారు, ఆ ప్రజలు మాత్రం మీ దగ్గర ఎన్నడూ ఏమీ దొంగిలించలేదు. మీరు ప్రజల మీద దాడిచేస్తారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించ లేదు. కనుక మీరు దొంగిలించటం మాని వేసినప్పుడు ఇతరులు మీ దగ్గర దొంగిలించటం మొదలు పెడ్తారు. మీరు ప్రజల మీద పడటం మానివేసినప్పుడు, ఆ ప్రజలు మీ మీద పడటం మొదలు పెడ్తారు. అప్పుడు మీరంటారు.
ఈ ఆయుధాలనే వారు వంట చెరకుగా ఉపయోగించటంతో వారు పొలాల్లో పుల్లలు ఏరటం గాని, అడవిలో కట్టెలు కొట్టటం గాని చేయవలసిన అవసరం లేదు. వారిని దోచుకోవాలని వచ్చిన సైనికుల నుండి విలువైన వస్తువులను వారే తీసుకుంటారు. తమవద్ద విలువైన వస్తువులను దోచుకున్న సైనికుల నుండి వారే మంచి వస్తువులను తీసుకుంటారు.” ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.