Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 16:6 - పవిత్ర బైబిల్

6 మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని, మోసగాళ్లని మేము విన్నాం. ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు. అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 మోయాబీయులు బహు గర్వముగలవారని మేము విని యున్నామువారి గర్వమునుగూర్చియు వారి అహంకార గర్వక్రోధములనుగూర్చియు విని యున్నాము.వారు వదరుట వ్యర్థము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 మోయాబు గర్వం గురించి మేము విన్నాం. అతని అహంకారం, అతని ప్రగల్భాలు, అతని క్రోధం గురించి విన్నాం. కానీ అతని ప్రగల్భాలు వట్టివి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 మోయాబు గర్వం గురించి మేము విన్నాము దాని అహంకారం చాలా ఎక్కువ దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం; అయితే దాని ప్రగల్భాలు వట్టివే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 మోయాబు గర్వం గురించి మేము విన్నాము దాని అహంకారం చాలా ఎక్కువ దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం; అయితే దాని ప్రగల్భాలు వట్టివే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 16:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే వాడు గర్విష్ఠి. తాను చేసే పనుల ద్వారా అతడు తను దుర్మార్గుడని చూపిస్తాడు.


ఇది మోయాబును గూర్చి విచారకరమైన సందేశం: ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. ఆ రాత్రి పట్టణం నాశనం చేయబడింది. ఒక రాత్రి కిర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. ఆ రాత్రే పట్టణం నాశనం చేయబడింది.


గర్విష్ఠులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ గర్విష్ఠులు అవమానంతో నేలమీద సాగిలపడ్తారు. ఆ సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతుడుగా నిలుస్తాడు.


యెహోవా హస్తం (శక్తి) ఈ కొండ మీద ఉంది. మరియు మోయాబు ఓడించబడుతుంది. యెహోవా శత్రువును అణగ త్రొక్కుతాడు. చెత్త కుప్ప మీద వరిగడ్డిపై నడిచినట్టుగా అది ఉంటుంది.


ఈత కొట్టేవానిలా యెహోవా తన చేతులు చాపుతాడు అప్పుడు ప్రజలు అతిశయించే వాటన్నిటినీ యెహోవా సమకూరుస్తాడు వారు తయారు చేసిన అందమైన వాటన్నింటినీ యెహోవా సమకూరుస్తాడు. యెహోవా వాటన్నింటినీ క్రింద పారవేస్తాడు


“మరణంతో మేము ఒక ఒడంబడిక చేసుకున్నాం. చావు స్థలం, పాతాళంతో మాకు ఒక ఒప్పందం ఉంది. కనుక మేము శిక్షించబడం. శిక్ష మమ్మల్ని బాధించకుండానే దాటి పోతుంది. మా మాయలు అబద్ధాల చాటున మేము దాక్కొంటాం” అని మీరు చెబుతున్నారు.


మరణంతోటి మీ ఒడంబడిక తుడిచి వేయబడుతుంది. పాతాళంతో మీ ఒడంబడిక మీకు సహాయం చేయదు. “ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని తన పాద ధూళిగా చేస్తాడు.


అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబుతారు. అయితే వారి అబద్ధాలు, అబద్ధాలుగా యెహోవా చూపిస్తాడు. మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రివారిగా చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్తాడు. వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. కాని వాళ్లు వెర్రివాళ్లలా కనిపించేట్టు యెహోవా చేస్తాడు.


“‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’ అని మీరు చెప్పుకోలేరు.


“యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది. కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి. మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు. ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.


మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది. ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”


బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను కత్తి సంహరించుగాక, ఆ యాజకులు ఒట్టి మూర్ఖులవుతారు. బబులోను సైనికులను ఒక కత్తి చంపుగాక. ఆ సైనికులు భీతావహులవుతారు.


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబువారు కాల్చివేశారు.


అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో: “దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు, కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.” అని వ్రాయబడి ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ