Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెషయా 15:6 - పవిత్ర బైబిల్

6 కానీ నిమ్రీము యేరు ఎడారిలా ఎండిపోయింది. మొక్కలన్నీ చచ్చాయి. ఏదీ పచ్చగా లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి యెండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెషయా 15:6
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది. పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది.


“హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది.


మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది. వారి ఎదుట దేశం ఏదెను వనంలా ఉంది. వారి వెనుక దేశం ఖాళీ ఎడారిలా ఉంది. ఏదీ వారినుండి తప్పించుకోలేదు.


వారు ఇలా చెప్పారు: “మీ సేవకులమైన మాకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. మేము ఏ దేశంతో పోరాడామో అది పశువులకు మంచి ప్రదేశం. (అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షెబాం, నెబో, బెయోను ఈ ప్రాంతంలో ఉన్నాయి.)


బేత్‌ నిమ్రా, బేత్హారాను పట్టణాలు కట్టారు. బలమైన గోడలు గల పట్టణాలను, వారి జంతువులకు కొట్టాలను వారు నిర్మించారు.


బేతారాము, బెత్‌నిమ్రా, సుక్కోతు, సఫోనులోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి ఉంది.


మొదటి దేవదూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబడ్డాయి. భూమిపైనున్న మూడవ భాగం కాలిపోయింది. మూడవ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. పచ్చగడ్డి పూర్తిగా కాలిపోయింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ