యెషయా 14:4 - పవిత్ర బైబిల్4 ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు. ఆ రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని పాలన అయిపోయింది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఆ రోజున నువ్వు బబులోను రాజు గూర్చి ఎగతాళి పాట ఎత్తి ఇలా పాడతావు. “బాధించిన వాళ్లకు అంతం ఎలా వచ్చిందో చూడు. గర్వించిన రౌద్రం ఎలా అంతమయ్యిందో చూడు! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది! အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా మిమ్మల్ని చేశాడు. తన శక్తితో ఆయన భూమిని చేశాడు. తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు. కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచిపోతారు. కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు. ఆ మనుష్యులు మిమ్మును నాశనం చేయాలని పథకం వేసారు. కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు.
నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”