యెషయా 14:1 - పవిత్ర బైబిల్1 భవిష్యత్తులో యెహోవా, తన ప్రేమను యాకోబుకు మరల చూపిస్తాడు. ఇశ్రాయేలీయులను యెహోవా మరల ఏర్పాటు చేసికొంటాడు. ఆ సమయంలో యెహోవా ఆ ప్రజలకు వారి దేశాన్ని ఇస్తాడు. అప్పుడు యూదులు కాని వారు, యూదా ప్రజల్లో చేరిపోతారు. ఈ ఇద్దరూ ఒకటిగా యాకోబు వంశం అవుతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులువారిని కలిసికొందురువారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా యాకోబు మీద జాలిపడతాడు. ఆయన మళ్ళీ ఇశ్రాయేలును ఎంపిక చేసుకుని వారికి తమ స్వదేశంలో పూర్వ క్షేమ స్థితి కలిగిస్తాడు. పరదేశులు వాళ్ళల్లో కలిసి, యాకోబు సంతతితో జత కూడుతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా చెబుతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాటిని పొందుతారు. ఆజానుబాహులైన సెబా ప్రజలు మీ వాళ్లవుతారు. వారు మెడలలో సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు. వాళ్లు మీ ఎదుట సాష్టంగపడతారు. వాళ్లు మీకు విన్నపం చేసుకొంటారు.” ఇశ్రాయేలూ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి ఇంకే దేవుడూ లేడు.
యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఇశ్రాయేలును కాపాడుతాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, “నా సేవకుడు దీనుడు. అతడు పాలకులను సేవిస్తాడు. ప్రజలు అతన్ని ద్వేషిస్తారు. కానీ రాజులు అతన్ని చూచి, అతడ్ని సన్మానించేందుకు నిలబడతారు. మహానాయకులు అతని ఎదుట సాగిలపడతారు.” ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా కోరినందుచేత ఇది జరుగుతుంది. మరియు యెహోవా నమ్మదగినవాడు. నిన్ను కోరుకొన్నవాడు ఆయనే.
మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు బండ్లమీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్ర పళ్లెములలో యెహోవా మందిరానికి తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు.
ప్రజలు వాగ్దానాలు చేసి అంటారు: “నిత్యుడైన దేవుని సాక్షిగా అని, ‘ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని వచ్చినది నిత్యుడైన యెహోవాయే!’ అని, ‘ఇశ్రాయేలీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల తీసుకొని వచ్చినది ఆయనే’ అని అంటారు. ప్రజలు ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయేలీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి మరల తీకుకొనివస్తాను.
మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”