యెషయా 13:8 - పవిత్ర బైబిల్8 ప్రతి వ్యక్తీ భయపడుతూంటాడు. స్త్రీ ప్రసవవేదనలా, వారి భయం వారికి కడుపులో బాధ పుట్టిస్తుంది. వారి ముఖాలు అగ్నిలా ఎర్రగా మారుతాయి. ఈ భయంచూపులు వారి పొరుగువారందరి ముఖాలమీద కూడా కనబడతాయి గనుక ప్రజలు ఆశ్చర్య పడతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 జనులు విభ్రాంతినొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు ఒకరినొకరు తేరి చూతురువారి ముఖములు జ్వాలలవలె ఎఱ్ఱబారును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 భయం వారిని పట్టుకుంటుంది, వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి; స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు. వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు, వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 భయం వారిని పట్టుకుంటుంది, వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి; స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు. వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు, వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. အခန်းကိုကြည့်ပါ။ |
నెగెవు అరణ్యానికి ఇలా చెప్పు, ‘యెహోవా వాక్కు విను. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. చూడు, నీ అరణ్యంలో అగ్ని రగల్చటానికి నేను సిద్దంగా ఉన్నాను. ప్రతి పచ్చని చెట్టునూ, ప్రతి ఎండిన చెట్టునూ అగ్ని దహించి వేస్తుంది. అలా కాల్చివేసే ఆ నిప్పు ఆర్పబడదు. దక్షణం నుండి ఉత్తరం వరకు గల ప్రదేశమంతా కాల్చివేయ బడుతుంది.