Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 9:11 - పవిత్ర బైబిల్

11 “ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టుకలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 ఎఫ్రాయిము విషయానికొస్తే వారి కీర్తి పక్షిలాగా ఎగిరిపోతుంది. ప్రసవమైనా, గర్భవతులుగా ఉండడం అయినా, గర్భం ధరించడమైనా వారికి ఉండదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఎఫ్రాయిం యొక్క ఘనత పక్షిలా ఎగిరిపోతుంది, పుట్టుక, గర్భధారణ, పిల్లలను కనడం వారిలో ఉండవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఎఫ్రాయిం యొక్క ఘనత పక్షిలా ఎగిరిపోతుంది, పుట్టుక, గర్భధారణ, పిల్లలను కనడం వారిలో ఉండవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 9:11
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, కాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.


“యోసేపు చాలా విజయశాలి. నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా, కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు.


ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలుగానే చనిపోయింది.


“అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది. అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.


మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక. చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.


ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను.


ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి. దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది. ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.” ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు.


సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకుపోబడింది.


వారు గర్విష్ఠులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారి ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.


శిక్షా సమయంలో ఎఫ్రాయిము పాడై పోతాడు. ఆ విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు) ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.


యెహోవా, నీ ఇష్టం వచ్చినదాన్ని వారికి చేయి. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇవ్వు, పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇవ్వు.


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు గిలాదులో గర్భిణీ స్త్రీలను చంపారు. ఆ ప్రాంతాన్ని కలుపుకొని తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు ఈ పని చేశారు.


‘గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి’ అనే రోజులు వస్తాయి.


యెహోవా మిమ్మల్ని శపిస్తాడు, మీకు అనేక మంది పిల్లలు కలగరు. ఆయన మీ భూమిని శపిస్తాడు, గనుక మంచి పంటను మీరు పొందరు. ఆయన మీ పశువులను శపిస్తాడు, గనుక అవి ఎక్కువ పిల్లల్ని ఈనవు. ఆయన మీ దూడలను గొర్రె పిల్లలను శపిస్తాడు.


ఆమె తన మాయని, తాను కన్న తన స్వంత పిల్లలను రహస్యంగా తినేస్తుంది. ఎందుకంటే బొత్తిగా ఆహారం లేదు గనుక. మీ శత్రువు మీ పట్టణాల మీద దాడి చేసి, ఎంతో శ్రమ కలిగించినపుడు ఇలా జరుగుతుంది.


యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ, ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి. యోసేపు మందలు మనుష్యుల్ని తోసివేస్తాయి. అందర్నీ, భూదిగాంతాల వరకు తోసివేస్తాయి. అవును, మనష్షేకు వేలాదిమంది ప్రజలు ఉన్నారు, అవును, ఎఫ్రాయిముకు పది వేలమంది ప్రజలు ఉన్నారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ