Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 8:5 - పవిత్ర బైబిల్

5 షోమ్రోనూ, నీ దూడను (విగ్రహాన్ని) యెహోవా నిరాకరించాడు. ఇశ్రాయేలీయుల మీద నేను చాలా కోపంగా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు వారి పాపం విషయంలో శిక్షించబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 షోమ్రోనూ, ఆయన నీ దూడను (విగ్రహము) విసర్జించెను నాకోపము వారిమీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాల కుందురు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ప్రవక్త ఇలా అంటున్నాడు “షోమ్రోనూ, ఆయన నీ దూడను విసిరి పారేశాడు.” యెహోవా ఇలా అంటున్నాడు. నా కోపం ఈ ప్రజల మీద మండుతూ ఉంది. ఎంత కాలం వారు అపవిత్రంగా ఉంటారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! నా కోపం వాటి మీద రగులుకుంది ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! నా కోపం వాటి మీద రగులుకుంది ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 8:5
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఓ యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు.


యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము. ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము. నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.


“మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు?


“ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు.


నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను. నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను. వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు. నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను. యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది. అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.”


యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలనుంచి చెడును కడిగి వేయండి. మీరు పరిశుద్ధ హృదయాలు కలిగి ఉండండి; తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దుష్ట ఆలోచనలు చేయటం మానివేయండి.


పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.


సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకుపోబడింది.


ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు.


ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను చేసుకుంటారు. పనివాళ్లు వెండితో ఆ విగ్రహాలను చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తమ ఆ విగ్రహాలతో మాట్లాడతారు. వాళ్లు ఆ విగ్రహాలకు బలులు సమర్పిస్తారు. వాళ్లు ఆ బంగారు దూడలను ముద్దు పెట్టుకొంటారు.


ఆ విగ్రహాలను ఒక పనివాడు చేశాడు. అవి దేవుళ్లు కావు. సమరయ దూడ ముక్కలుగా విరుగగొట్టబడుతుంది.


షోమ్రోనుయొక్క పాపము సాక్షిగా ప్రమాణం చేసేవారు ఇలా అంటారు: ‘దానూ, నీ దేవుని జీవముతోడు.’ ‘బెయేర్షెబా మార్గంతోడు’ అని. ఆ ప్రజలు పతనమవుతారు, వారు మరెన్నడూ లేవరు.”


దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగగొట్టబడతాయి. అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది. దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది. కావున ఈ వస్తువులన్నీ నాపట్ల అవిశ్వాసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి.


వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేసారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతుల్తో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకొన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ