Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 6:4 - పవిత్ర బైబిల్

4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి? యూదా, నిన్ను నేను ఏమి చేయాలి? నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది. వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 6:4
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.


యెహోవానైన నేనిలా అనుకున్నాను, “మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం. మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది. ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది. మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.


కొద్ది కాలంక్రిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది సక్రమమైనదో దానిని చేయటానికి సిద్ధమయ్యారు. బానిసలుగా ఉన్న సాటి హెబ్రీయులకు మీలో ప్రతి ఒక్కడూ స్వేచ్ఛ నిచ్చాడు. నా నామాన పిలువబడే నా ఆలయంలో నా ముందు ఆ మేరకు మీరొక ఒడంబడిక కూడ చేశారు.


కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు. వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు.


దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక కారణం చూపించు. నీ పిల్లలు నన్ను త్యజించారు. దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు. నీ సంతానానికి కావలసిన ప్రతుది నేను యిచ్చి వున్నాను. అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై ఉన్నారు! వారెక్కువ కాలం వ్యభిచార గృహాలలోనే గడిపారు


ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” ఇదే యెహోవా వాక్కు. “అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలిగదా. వారికి తగిన శిక్ష విధించాలి.


కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెబుతున్నాడు, “లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను! నాకు వేరే మార్గం లేదు. నా ప్రజలు పాపం చేశారు.


“ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకు లేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను సెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చుకుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.


అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. ఆ పొగమంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యం తూర్పార పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.


“ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను! ఎఫ్రాయిము యొక్క పాపంగూర్చి ప్రజలు తెలుసుకొంటారు. సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. ఆ పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.


అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు.


ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ