13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సిందూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లుకూడా పాపాలు చేస్తారు.
13 వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు. కొండలపై ధూపం వేస్తారు. సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు. అందువలనే మీ కూతుర్లు వేశ్యలయ్యారు. మీ కోడళ్ళు కూడా వ్యభిచారిణులయ్యారు.
13 వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు కొండలమీద ధూపం వేస్తారు, సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు. కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు.
13 వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు కొండలమీద ధూపం వేస్తారు, సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు. కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు.
ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి యెహోవాయే రక్షించాడు. కాని ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా వారిని సంరక్షించాడు.
తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.
మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని చెట్టు క్రింది తప్పుడు దేవుళ్లనూ పూజించటమే. మీరు ప్రతికాలువ ప్రక్క పిల్లల్నీ చంపుతారు, బండల స్థలాల్లో వారిని బలి ఇస్తారు.
“యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు. నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు. ‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు. నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుక్రింద పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు.
నీవు నీ పాపాన్ని గుర్తించాలి. నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు నీ పాపం అదే. ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు నీవు ప్రతి పచ్చని చెట్టు క్రిందా విగ్రహారాధన చేశావు నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’” ఇదే యోహోవా వాక్కు.
రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది.
విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి.
నీ అందమైన వస్త్రాలను తీసుకొని, నీ ఆరాధనా స్థలాలను అలంకరించటానికి నీవు వాటిని వినియోగించావు. ఆ స్థలాలలో నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీ ప్రక్కగా వచ్చిన ప్రతివానికీ నిన్ను నీవు సమర్పించుకున్నావు.
ప్రతి బాట మొదలయ్యిన చోటా నీవు పూజకై గుట్టలు నిర్మించావు. తరువాత నీవు నీ అందాన్ని భ్రష్టపర్చుకున్నావు. అటుపోయే ప్రతి మనుష్యునీ నీ వలలో వేసుకొనేటందుకు దానిని వినియోగించుకున్నావు. వారికి నీ కాళ్ళు కన్పించేలాగు నీ చీర పైకెత్తావు. తరువాత ఆ మనుష్యులతో నీవొక వేశ్యలా ప్రవర్తించావు.
అప్పుడు మాత్రమే నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీ అపవిత్రమైన మీ విగ్రహాలముందు, వాటి బలిపీఠాల చుట్టూ పడిన మీ శవాలను చూచినప్పుడు మీరిది తెలుసుకుంటారు. ఆ శవాలు మీ ఆరాధనా స్థలాలున్న ప్రతిచోట, ప్రతి కొండ, పర్వతం మీద, ప్రతి పచ్చని చెట్టు, ఆకులున్న ప్రతి సింధూర వృక్షం క్రింద పడి వుంటాయి. ఆ స్థలాలన్నిటిలో మీరు మీ బలులు సమర్పించారు. అవి మీ హేయమైన విగ్రహాలకు సుగంధ పరిమళాలు.
ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు.
కాని, ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు. బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు. విగ్రహాలకు వారు ధూపం వేశారు.
“ఆమె బయలు దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది. ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి, నన్ను మరచిపోయింది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.
కాని యెహోవా చెప్పేదేమంటే: ‘నీ భార్య నగరంలో వేశ్య అవుతుంది. నీ కుమారులు, కుమార్తెలు కత్తులతో చంపబడతారు. అన్యజనులు నీ రాజ్యాన్ని వ పర్చుకొని, తమలో తాము దానిని పంచుకుంటారు. నీవు పరదేశంలో చనిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయంగా ఈ దేశంనుండి బందీలుగా తీసికొనిపోబడతారు.’”