Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 4:12 - పవిత్ర బైబిల్

12 నా ప్రజలు కట్టెముక్కలను సలహా అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 నా జనులు తాము పెట్టుకొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు. వారి చేతికర్ర వారికి ప్రవచనాలు చెబుతున్నది. వ్యభిచార మనస్సు వారిని దారి తప్పించగా వారు నన్ను, అంటే వారి దేవుణ్ణి విసర్జించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నా ప్రజలు చెక్క విగ్రహాన్ని సంప్రదిస్తారు, సోదె చెప్పే వాని కర్ర వారితో మాట్లాడుతుంది. వ్యభిచార ఆత్మ వారిని చెదరగొడుతుంది; వారు తమ దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నా ప్రజలు చెక్క విగ్రహాన్ని సంప్రదిస్తారు, సోదె చెప్పే వాని కర్ర వారితో మాట్లాడుతుంది. వ్యభిచార ఆత్మ వారిని చెదరగొడుతుంది; వారు తమ దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 4:12
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి యెహోవాయే రక్షించాడు. కాని ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా వారిని సంరక్షించాడు.


అంతేకాదు నీవు ఇశ్రాయేలు రాజులు నడచిన పెడమార్గాన్ని అనుసరించావు. దేవుడు ఆశించిన రీతిగా నడవకుండా నీవు యూదా, యెరూషలేము ప్రజలను ఆపావు. అదే నేరాన్ని అహాబు, అతని కుటుంబంవారు చేశారు. వారు దేవుని పట్ల విశ్వాస ఘాతకులైనారు. నీవు నీ సోదరులను హత్యచేశావు. నీకంటె నీ సోదరులు మంచివారు.


కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు. దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు.


దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు. నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.


అన్యదేశవాసులు మందబుద్ధులు, మూర్ఖులు. వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.


ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, ‘నీవే మాకు జన్మనిచ్చావు’ అంటారు. ఆ ప్రజలంతా అవమానం పొందుతారు. ఆ ప్రజలు నావైపుకు చూడరు. వారు విముఖులై నాకు వెన్ను చూపుతారు. కాని యూదాప్రజలు కష్టాల పాలైనప్పుడు, ‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.


“సమరయ ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను. బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను. ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.


ఇతర రాజ్యాల మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీరు అంటూ ఉంటారు. కానీ మీ అభిప్రాయాలు, ఆశలూ ఎప్పటికీ నెరవేరవు. ఇతర జనాంగముల ప్రజల మాదిరిగా మీరు నివసిస్తున్నారు. కొయ్యముక్కలను, రాతి ముక్కలను (విగ్రహాలు) మీరు కొలుస్తారు!’”


ఇది బబులోను రాజు ఆ ప్రాంతాన్ని తాను ఎలా ఎదుర్కోవాలన్నదానిని తెలుపుతుంది. బబులోను రాజు ఆ మార్గం రెండుగా విడిపోయే చోటికి వచ్చాడు. బబులోను రాజు తన భవిష్యత్తు కార్యక్రమం తెలుసుకొనటానికి మంత్ర, తంత్ర సంకేతాలను ఉపయోగించాడు. అతడు కొన్ని బాణాలు తీసుకొన్నాడు. తన కులదేవతలను కొన్ని ప్రశ్నలడిగాడు. పిమ్మట అతడు చంపిన ఒక జంతువు కార్జంవెపు చూశాడు.


అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.”


ఇశ్రాయేలు ప్రజలు చెడ్డపనులు అనేకం చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా ఆ చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలను వెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలుస్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు.


ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను. ఎఫ్రాయిము దేవునికి అపనమ్మకస్తుడు. ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.


ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు.


వారు వారి ‘మేక పోతు విగ్రహాలకు’ ఇంక ఎలాంటి బలులూ అర్పించకూడదు. ఆ ఇతర దేవుళ్ళను వారు వెంబడిస్తూ వచ్చారు. అలా వారు వ్యభిచారిణుల్లా ప్రవర్తించారు. ఈ నియమాలు ఎప్పటికీ కొనసాగుతాయి.


కానీ నేను మాత్రం అతనికి, అతని కుటుంబానికి విరోధంగా ఉంటాను. అతణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరుచేసేస్తాను. నాకు అపనమ్మకంగా ఉండి, మోలెకును వెంబడించే ఏ వ్యక్తినైనా సరే నేను వేరు చేసేస్తాను.


ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు, “నాకు ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని అనవచ్చు. అతడు వారికి ఆ విధంగా బోధకుడవుతాడు!


ఒక కొయ్య విగ్రహముతో “నిలబడు” అని చెప్పేవానికి మిక్కిలి వేదన! మాట్లాడలేని ఒక రాతితో, “మేలుకో” అని చెప్పేవానికి బాధ తప్పదు. ఆ వస్తువులు అతనికి సహాయపడలేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని ఆ విగ్రహంలో ప్రాణం లేదు.


మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగుతారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన ప్రకారం చేయరు.


మోషెతో యెహోవా ఇలా చెప్పాడు: “త్వరలో నీవు చనిపోతావు. నీవు నీ పూర్వీకులతో ఉండేందుకు వెళ్లిపోయిన తర్వాత, ఈ ప్రజలు నాకు నమ్మకంగా ఉండరు. నేను వాళ్లతో చేసిన ఒడంబడికను వాళ్లు ఉల్లంఘిస్తారు. వాళ్లు నన్ను విడిచిపెట్టేసి, వారు వెళ్తున్న దేశంలోని ఇతర దేవుళ్లను, అబద్ధపు దేవుళ్లను పూజించటం మొదలు పెడ్తారు.


అప్పుడు వారతనితో ఇలా అన్నారు; “దయచేసి మాకోసంకూడా దేవుణ్ణి ఏదో ఒకటి అడుగు. ఏదైనా మేము తెలుసుకోదలచాము. ఉండడానికి చోటుకోసం వెతుకుతున్న మా అన్వేషణ విజయవంతమవుతుందా?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ