Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




హోషేయ 2:10 - పవిత్ర బైబిల్

10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తినుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలోనుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 దాని విటులు చూస్తుండగానే ఆమె బట్టలు విప్పేస్తాను. నా చేతిలో నుండి ఆమెను విడిపించే వారెవరూ ఉండరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట, ఆమె కామాతురతను బయటపెడతాను, ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట, ఆమె కామాతురతను బయటపెడతాను, ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




హోషేయ 2:10
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

గతంలో అతల్యా కుమారులు ఆలయంలో జొరబడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్నిటినీ వారు బయలు దేవుళ్ల ఆరాధనకు వినియోగించారు. అతల్యా ఒక దుష్ట స్త్రీ.


నేను మిమ్ములను చీల్చివేయకముందే, దేవుని మరచిన జనాంగమైన మీరు, ఈ విషయమును గూర్చి ఆలోచించాలి. అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.


దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం. మంచివాళ్లు స్వతంత్రులుగా చేయబడతారు.


సీయోనులో ఆ స్త్రీల తలలమీద నా ప్రభువు పుండ్లు పుట్టిస్తాడు. ఆ స్త్రీలు వారి తలలు విరబోసుకొనేట్టుగా యెహోవా చేస్తాడు.


“నాకెందుకీ చెడు దాపురించింది?” అని నీకు నీవే ప్రశ్నించుకో. నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు. నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది. నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి. నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు.


యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను. ప్రతివాడూ నిన్ను చూస్తాడు. నీవు అవమానం పాలవుతావు.


నీ అందమైన వస్త్రాలను తీసుకొని, నీ ఆరాధనా స్థలాలను అలంకరించటానికి నీవు వాటిని వినియోగించావు. ఆ స్థలాలలో నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీ ప్రక్కగా వచ్చిన ప్రతివానికీ నిన్ను నీవు సమర్పించుకున్నావు.


నేను నీకు రొట్టె, తేనె, నూనె ఇచ్చాను. కాని నేనిచ్చిన ఆహారాన్నంతా నీవు నీ విగ్రహాలకు సమర్పించావు. నీ బూటకపు దేవతల తృప్తికొరకు నీవు వాటిని మనోహరమైన పరిమళంగా సమర్పించావు. ఆ బూటకపు దేవతలతో నీవొక వేశ్యవలె వ్యవహరించావు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


వారు నిన్నెంత అసహ్యించుకుంటున్నారో వారు నీకు చూపిస్తారు. నీవు పనిచేసిందానినంతా వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నగ్నంగా వదులుతారు! ప్రజలు నీ పాపాలను విశదంగా చూస్తారు. నీవు వేశ్యలా ప్రవర్తించావని, నీవు నీచమైన కలలుగన్నావని వారు తెలుసుకుంటారు.


విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి. కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది. కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్తంభాలను నిలిపాడు.


ఇశ్రాయేలులో ఎఫ్రాయిము చాలా ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు. ఎఫ్రాయిము మాట్లడితే చాలు, ప్రజలు భయంతో కంపించి పోయేవారు. కాని ఎఫ్రాయిము పాపకార్యాలు చేశాడు. అతను బయలు దేవతని ఆరాధించాడు.


ఆమె తన వ్యభిచారం మానుకోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను.


బందిపోటు దొంగలు దాగుకొని, ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు. అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు. వారు దుర్మార్గపు పనులు చేశారు.


అడవి జంతువుల మధ్య సింహం ఎలా ఉంటుందో, యాకోబు సంతతిలో మిగిలినవారు, చాలామంది ప్రజలకు అలా ఉంటారు. గొర్రెలమందల్లో చొరబడిన కొదమసింహంలా వారుంటారు. సింహం నడుచుకుంటూ వెళ్లినప్పుడు అది ఎటు వెళ్లదలిస్తే అటు వెళుతుంది. అది ఒక జంతువును ఎదుర్కొన్నప్పుడు ఎవ్వడూ దానిని అదుపు చేయలేడు. మిగిలి ఉన్న జనులు అటువంటి సింహంలా ఉంటారు.


అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ