హోషేయ 1:2 - పవిత్ర బైబిల్2 ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి, ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కను. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను–జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారముచేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు. “వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో. ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు. ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 యెహోవా హోషేయ ద్వారా మాట్లాడడం ఆరంభించినప్పుడు, యెహోవా ఇలా అన్నారు, “వెళ్లు, ఒక వ్యభిచారిణిని పెళ్ళి చేసుకో, ఆమెతో పిల్లలు కను, ఎందుకంటే ఈ దేశం కూడా ఒక వ్యభిచారిణిలా యెహోవాకు నమ్మకద్రోహం చేస్తూ ఉంది.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 యెహోవా హోషేయ ద్వారా మాట్లాడడం ఆరంభించినప్పుడు, యెహోవా ఇలా అన్నారు, “వెళ్లు, ఒక వ్యభిచారిణిని పెళ్ళి చేసుకో, ఆమెతో పిల్లలు కను, ఎందుకంటే ఈ దేశం కూడా ఒక వ్యభిచారిణిలా యెహోవాకు నమ్మకద్రోహం చేస్తూ ఉంది.” အခန်းကိုကြည့်ပါ။ |
అలా మిగిలిన వారు బందీ చేయబడతారు. వారు అన్యదేశాలలో నివసించేలా తరిమివేయబడతారు. కాని, అలా మిగిలిన వారు నన్ను తలచుకొంటారు. నేను వారి గుండెలు బద్దలయ్యేలా చేశాను. వారు చేసిన చెడు కార్యాలకు వారిని వారే అసహ్యించుకుంటారు. గతంలో వారు నాకు విముఖులై, నన్ను వదిలిపెట్టారు. హేయమైన వారి విగ్రహాల వెంట వారు వెళ్ళారు. తన భర్తను వదిలి, పరాయి పురుషుని వెంటబడిన స్త్రీవలె వారున్నారు. వారెన్నో భయంకరమైన పనులు చేశారు.