ఆదికాండము 24:3 - పవిత్ర బైబిల్3 ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వనని భూమ్యాకాశాలకు దేవుడగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3-4 నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3-4 నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్లు దేవుని కుమారులు చూశారు. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు. ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను నెఫీలులనువారు ఆ దేశంలో నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు. అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు మానవ మాత్రులు, వారి మూలంగా నా ఆత్మను ఎల్లప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని బ్రతకనిస్తాను.”
హీరాము తన సందేశంలో ఇంకా యిలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు.
అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్లకి చెప్పాను. నేను వాళ్లని శపించాను. వాళ్లలో నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్లచేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా చూడండి.
యెహోవా నీవే దేవుడివి!, యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు, వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు! భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ నీవే సృజించావు! సముద్రాలను సృజించింది నీవే. వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే! ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే, దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించమని భూమిని వేడుకొంటున్నారు. కానీ భవిష్యత్తులో వారు ఆశీర్వాదాలకోసం నమ్మకమైన దేవుణ్ణి అడుగుతారు. ఇప్పుడు ప్రజలు ప్రమాణాలు చేసినప్పుడు వారు భూశక్తిని నమ్ముకొంటున్నారు. కానీ భవిష్యత్తులో వారు నమ్మకమైన దేవుణ్ణి నమ్ముకొంటారు. ఎందుకంటే గతంలోని కష్టాలు మరువబడుతాయి గనుక. ఆ కష్టాలను నాప్రజలు ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు.
“ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము, ‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు. వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’” తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే. దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. తన అవగాహనతో దేవుడు ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు.
కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా …’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను.
నక్షత్రాలను పూజించుటకు వారి యింటి కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి వేస్తాను. ఆ బూటకవు యాజకులను ప్రజలు మరచి పోతారు. కొంతమంది నన్ను పూజిస్తున్నామని అంటారు. ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిల్కోమును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలంనుండి నేను తొలగించి వేస్తాను.
కనుక నీవు ప్రత్యేక జలం తాగినప్పుడు నీకు గొప్ప కీడు సంభవిస్తుంది. నీ కడుపు ఉబ్బిపోతుంది, ఇంక నీకు పిల్లలు పుట్టరు. నీవు గర్భవతివి అయితే నీ శిశువు చనిపోతుంది. అప్పుడు నీ వాళ్లంతా నిన్ను విడిచిపెట్టేసి, నిన్నుగూర్చి చెడుగా చెప్పుకొంటారు.’ “ఆ స్త్రీ యెహోవాకు ప్రత్యేక ప్రమాణం చేయాలని యాజకుడు ఆమెతో చెప్పాలి. ఆ స్త్రీ అబద్ధం గనుక చెబితే ఈ కీడు తనకు జరుగుతుందని ఒప్పుకోవాలి.