Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 15:9 - పవిత్ర బైబిల్

9 అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఆయన–మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఆయన “మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా” అని అతనితో చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 15:9
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేశాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు.


అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.


అబ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొన్నాయి. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమారుడు రక్షించబడ్డాడు.


“నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి. వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.


పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! విను, పావురాలు తిరిగి వచ్చాయి.


మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది. ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు. దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు. ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు. ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు. ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.


“ఒక వ్యక్తి గొర్రెనుగాని మేకనుగాని దహన బలిగా అర్పిస్తుంటే, ఏ దోషం లేని మగదానిని మాత్రమే అతడు అర్పించాలి.


“ఒక వ్యక్తి ఒక పక్షిని యెహోవాకు దహన బలిగా అర్పించాలను కొంటే, తెల్ల గువ్వ, లేక పావురం పిల్ల మాత్రమే యివ్వాలి.


“ఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని దహనబలిగా అర్పిస్తుంటే, అది నిర్దోషమైన గిత్తయి వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ అర్పణను అంగీకరిస్తాడు.


“ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి.


రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను అతడు తీసుకొనిరావాలి. పేదవాళ్లుకూడ వాటిని తీసుకొని రాగలుగుతారు. ఒక పక్షి పాపపరిహారార్థబలి కొరకు, మరొకటి దహనబలి కొరకు.


“అప్పుడు ఆ వ్యక్తి ఒక గువ్వ లేక పావురపు పిల్లలలో ఒకదానిని అర్పించాలి. (పేదవారు కూడా ఆ పక్షులను ఇవ్వగలరు, ఆ వ్యక్తి ఇవ్వగలిగిందే ఇవ్వాలి).


“ఒక వేళ ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ సమాధాన బలి అయితే, మగ లేక ఆడ జంతువును తన పశువుల మందలోనుండి అతడు యెహోవాకు ఇస్తే ఆ పశువులో ఎలాంటి దోషం ఉండకూడదు.


“ఒకవేళ ఆ వ్యక్తి, యెహోవాకు సమాధాన అర్పణగా ఒక జంతువును మందలోనుండి తెస్తే, అది ఆడదిగాని, మగదిగాని దోషం లేనిదిగా ఉండాలి.


అహరోనుతో మోషే ఇలా చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడను పాపపరిహారార్థబలిగాను, పొట్టేలును దహనబలిగాను యెహోవాకు అర్పించండి.


సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’”


అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ