Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆదికాండము 1:2 - పవిత్ర బైబిల్

2 భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆదికాండము 1:2
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”


ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.


ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను. మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.


మొసలి ఈదినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది. అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.


కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.


దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు. నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.


దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.


భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు! మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.


యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది. భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.


నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను. నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.


పక్షులు వాటి గూళ్ల చుట్టూ ఎగిరినట్టు, సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. యెహోవా దానిని రక్షిస్తాడు. యెహోవా “దానిపై దాటి”, యెరూషలేమును రక్షిస్తాడు.


యెహోవాయే దేవుడు. ఆయనే భూమిని, ఆకాశాలను సృజించాడు. భూమిని యెహోవా దాని స్థానంలో ఉంచాడు. యెహోవా భూమిని చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన కోరలేదు. భూమి మీద జీవం ఉండాలని యెహోవా కోరాడు. యెహోవా చెబుతున్నాడు: “నేనే యెహోవాను. నేను తప్ప ఇంకో దేవుడు లేడు.


నేను భూమివైపు చూశాను. భూమి ఖాళీగా ఉంది; దానిపై ఏమీ లేదు. నేను అకాశంవైపు చూశాను. వెలుగు పోయింది.


ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది. ప్రతీదీ దోచుకోబడింది. నగరం నాశనం చేయబడింది! ప్రజలు వారి ధైర్యాన్ని కోల్పోయారు. వారి హృదయాలు భయంతో వికలమవుతున్నాయి. వారి మోకాళ్ళు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. వారి శరీరాలు వణుకుతున్నాయి వారి ముఖాలు భయంతో వెలవెల పోతున్నాయి.


“చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!” అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.


యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లలకు ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది. అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది. అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది. మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది. యెహోవా అలాగే ఉన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ