Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 8:33 - పవిత్ర బైబిల్

33 నాల్గవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 నాలుగవదినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితోకూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 నాలుగో రోజు వెండి బంగారు పాత్రలను మన దేవుని మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 8:33
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

లేవీయుల్లో పరాయి స్త్రీలను పెళ్లి చేసుకున్నవారు: యోజాబాదు, షిమీ, కెలిథా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.


ఇప్పుడిక లేవీయులలో హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు 74


దేవాలయం కోసం ఇవ్వబడిన వెండిని, బంగారాన్ని తదితర వస్తువులను తూకం వేయించాను. నేను ఎంపికచేసిన పన్నెండుగురు యాజకులకు నేను వాటిని అప్పగించాను. అర్తహషస్త రాజు, ఆయన మంత్రులు, ఆయన ముఖ్యాధికారులు, బబులోనులోని ఇశ్రాయేలీయులు అందరూ దేవుని దేవాలయం కోసం యిచ్చిన వస్తువులవి.


నేను వాటన్నింటినీ తూకం వేశాను. వెండి 25 టన్నులు వుంది. వెండిగిన్నెలు, వస్తువులు మూడుమ్ముప్పాతిక టన్నులున్నాయి. మూడుమ్ముప్పాతిక టన్నుల బంగారం వుంది.


అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, యెరూషలేములోని యెహోవా దేవాలయంలోని గదుల్లో పదిలపరుస్తారు.”


ఎజ్రా తూకం వేసి తమకిచ్చిన వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ యాజకులూ, లేవీయులు స్వీకరించి, ఎజ్రా చెప్పినట్లు, వాటిని యెరూషలేము లోని దేవాలయానికి చేర్చేందుకు సంసిద్ధులయ్యారు.


మేము అన్ని వస్తువులనూ లెక్క పెట్టి, వాటన్నింటినీ తూకం వేశాము. తర్వాత మేము అప్పటి మొత్తం బరువును వ్రాసి పెట్టాము.


వాళ్ల సోదరులు: షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను,


హరిము, మెరేమోతు, ఓబద్యా,


ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన లేవీయుల పేర్లు ఇవి: అజన్యా కుమారుడు యేషువా, హేనాదాదు వంశానికి చెందిన బిన్నూయి, కద్మీయేలు,


హక్కోజు మనుమడు, ఊరియా కుమారుడు అయిన మెరేమోతు ఎల్యాషీబు ఇంటి ముఖ ద్వారం నుంచి, ఆ ఇంటి చివరిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.


హేనాదాదు కొడుకు బిన్నూయి అజర్యా ఇంటి దగ్గర్నుంచి ప్రాకారపు మలుపుదాకా, అక్కణ్నుంచి మూలదాకా గోడభాగాన్ని బాగుచేశాడు.


ఊరియా కుమారుడు మెరేమోతు గోడలో తర్వాత భాగాన్ని నిర్మించాడు. (ఊరియా హక్కోజు కుమారుడు). బెరెక్య కుమారుడు మెషుల్లాము గోడలో తర్వాత భాగాన్ని కట్టాడు. (బెరెక్యా మెషేజబెయేలు కుమారుడు.) బయనా కొడుకు సాదోకు గోడలో తర్వాత భాగము కట్టాడు.


జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ