ఎజ్రా 7:23 - పవిత్ర బైబిల్23 పరలోక దేవుడు ఎజ్రా కోసం ఏమి ఆదేశిస్తే, దాన్ని మీరు ఎజ్రాకి సత్వరం, సంపూర్ణంగా ఇవ్వండి. మీరీ పనులు పరలోక దేవుని ఆలయంకోసం చెయ్యండి. దేవునికి నా సామ్రాజ్యం మీదా, నా కొడుకుల మీదా కోపం రావడం నాకు యిష్టం లేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింప వలసినది. రాజుయొక్క రాజ్యముమీదికిని అతని కుమారులమీదికిని కోపమెందుకు రావలెను? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఆకాశంలో ఉండే దేవుడు ఏమి నిర్ణయించాడో దానినంతా ఆ దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించండి. రాజ్యం మీదికి, రాజు మీదికి, రాజ కుమారుల మీదికి ఎందుకు దేవుని కోపం రగులుకొనేలా చేసుకోవాలి? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 పరలోక దేవుడు నిర్దేశించిన ప్రకారం పరలోక దేవుని మందిరం కోసం శ్రద్ధగా చేయాలి. రాజు అతని కుమారుల సామ్రాజ్యం మీదికి దేవుని కోపం ఎందుకు రావాలి? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 పరలోక దేవుడు నిర్దేశించిన ప్రకారం పరలోక దేవుని మందిరం కోసం శ్రద్ధగా చేయాలి. రాజు అతని కుమారుల సామ్రాజ్యం మీదికి దేవుని కోపం ఎందుకు రావాలి? အခန်းကိုကြည့်ပါ။ |
దానికి మోషే, అహరోనులు, “హీబ్రూ ప్రజల దేవుడు మాతో మాట్లాడాడు. కనుక మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్లనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అక్కడ మా యెహోవా దేవునికి ఒక బలి అర్పిస్తాము. ఇది మేము చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో. ఒక రోగం ద్వారానో, కత్తి చేతనో మమ్మల్ని చంపేస్తాడేమో” అని అన్నారు.