ఎజ్రా 6:22 - పవిత్ర బైబిల్22 వాళ్లు ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అష్షూరు రాజు మనోవైఖరిని మార్చి, యెహోవా వాళ్లకెంతో సంతోషం కలిగించాడు. దానితో, అష్షూరు రాజు దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం చేందుకు వాళ్లకి తోడ్పడ్డాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుని మందిరం పని విషయంలో యెహోవా అష్షూరురాజు మనసు మార్చి వారికి ధైర్యం కలిగించి వారు ఆనందభరితులయ్యేలా చేశాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం, యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:
వారందరినీ నేను బబులోను (బాబిలోనియా) నుండి రప్పిస్తాను. ముఖ్యంగా కల్దీయులను రప్పిస్తాను. పెకోదు, శోయ, కోయ ప్రాంతాలనుండి నేను పురుషులను రప్పిస్తాను. అష్టూరు నుండి కూడ నేను మనుష్యులను రప్పిస్తాను. తమ నాయకులను, అధికారులను రప్పిస్తాను. వారంతా కోరుకోతగ్గ యువకులు. రథాధిపతులు, ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గుర్రపు రౌతులు వారిలో వున్నారు.