Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఎజ్రా 3:5 - పవిత్ర బైబిల్

5 అటు తర్వాత, ప్రతి రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, శెలవు రోజులకూ, స్వేచ్ఛార్ఫణలను యెహోవా ఆజ్ఞ ప్రకారం అర్పించారు. జనం కూడా యెహోవాకు తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 తరువాత అనుదినం అర్పించాల్సిన దహన బలులు, అమావాస్యలకు యెహోవా కోసం నియమితమైన పండగలకు ప్రతిష్ఠితమైన దహనబలులు, ప్రతి ఒక్కరూ తీసుకు వచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పిస్తూ వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఎజ్రా 3:5
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ప్రజలు దేవునికి ఇచ్చే ఉచిత కానుకల విషయమై శ్రద్ధ తీసుకోనే అధికారి పేరు కోరే. దేవునికి ఇవ్వబడిన కానుకల పంపిణీ విషయంలో ఇతడు శ్రద్ధ తీసుకొంటాడు. దేవునికి ఇవ్వగా పవిత్ర పర్చబడిన ధానాల పంపిణీ విషయంలో కూడా బాధ్యత ఇతనిదే. కోరే తూర్పు ద్వారపాలకుడు. ఇతని తండ్రి లేవీయుడైన ఇమ్నా.


ఈ విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆ ఇశ్రాయేలీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనారంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి నిర్మించబడకపోయినా కూడా ఈ బలి అర్పణ సాగింది.


“యాజకులము, లేవీయులము, సామాన్య జనమైన మనము చీట్లు వేసుకున్నాము. తద్వారా, మా కుటుంబాల్లో ఏటా మన ఆలయానికి ఏయే నిర్ణీతదినాల్లో కట్టెల మోపులు (సమిధలు) తేవాలో తెల్సుకున్నాము. ఆ కట్టెలు మన దేవుడైన యెహోవా గట్టు మీద హోమం కోసం తెచ్చేవి. అదంతా మేము సరిగ్గా ధర్మశాస్త్రంలో వ్రాసిన నిబంధనల ప్రకారం చెయ్యాలి.


లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”


“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, ఆవుల మందలోనుండి గాని, గొర్రెల మందలోనుండి గాని దానిని తీసుకొని రావాలి.


“ఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని దహనబలిగా అర్పిస్తుంటే, అది నిర్దోషమైన గిత్తయి వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ అర్పణను అంగీకరిస్తాడు.


“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే:


ప్రతి కోడె దూడతోబాటు పడిన్నర ద్రాక్షారసం, పొట్టేలుతోబాటు ఒక్క పడి ద్రాక్షారసం, ప్రతి గొర్రెపిల్లతోబాటు ముప్పావు ద్రాక్షారసం పానార్పణం. ఇది సంవత్సరంలో నెలనెలా అర్పించాల్సిన దహనబలి.


మీరు యెహోవాకు దహనబలులు అర్పించాలి. దహనబలులు రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, అంగవిహీనం లేని సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు.


మీరు దహనబలులు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు మీరు అర్పించాలి.


దహన బలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు 14 మీరు అర్పించాలి.


దహనబలులను మీరు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.


“ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.”


దహనబలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము కాని ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రె పిల్లలను మీరు అర్పించాలి.


“మీరు నివసించే స్థలాల్లో మీరు తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏవనగా: దేవునికి చేందిన ధాన్యం, దేవునికి చెందిన మీ కొత్త ద్రాక్షారసం, నూనె భాగాలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదట పుట్టినవి, మీరు దేవునికి వాగ్దానం చేసిన ఏ కానుకగాని, ఏ స్వేచ్ఛార్పణలుగాని, లేక దేవునికి చెందిన ఏ కానుకలేగాని,


మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ