ఎజ్రా 2:68 - పవిత్ర బైబిల్68 ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు పూనుకొన్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)68 కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201968 గోత్రాల ప్రముఖులు కొందరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి వచ్చి, దేవుని మందిరం కట్టడానికి స్వచ్చందంగా కానుకలు అర్పించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం68 వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం68 వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |
మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు.