యెహెజ్కేలు 9:8 - పవిత్ర బైబిల్8 ఆ మనుష్యులు ప్రజలను చంపటానికి వెళ్లగా, నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి ఆనించి నమస్కరించి, “నా ప్రభువైన ఓ యెహోవా, యెరూషలేముపై నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు ఇశ్రాయేలులో మిగిలి ఉన్న వారిని చంపివేయటం లేదు కదా!” అని అన్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని–అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాళ్ళు చంపడం మొదలు పెట్టిన తరువాత నన్ను తప్ప వాళ్ళు అందరినీ చంపడం చూశాను. నేను ఒంటరిగా ఉండటం చూసి నేను సాష్టాంగ పడ్డాను. గట్టిగా వేడుకున్నాను. “అయ్యో! ప్రభూ! యెహోవా, యెరూషలేముపై నీ క్రోధాన్ని కుమ్మరించి ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేస్తావా?” అన్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వారు చంపుతూ ఉన్నప్పుడు నేను ఒక్కడినే మిగిలి పోయాను, అప్పుడు నేను నేలపై పడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో! ప్రభువైన యెహోవా! యెరూషలేముపై నీ ఉగ్రతను కుమ్మరించి ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారందరిని నాశనం చేస్తావా?” అని మొరపెట్టాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వారు చంపుతూ ఉన్నప్పుడు నేను ఒక్కడినే మిగిలి పోయాను, అప్పుడు నేను నేలపై పడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో! ప్రభువైన యెహోవా! యెరూషలేముపై నీ ఉగ్రతను కుమ్మరించి ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారందరిని నాశనం చేస్తావా?” అని మొరపెట్టాను. အခန်းကိုကြည့်ပါ။ |
యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.
అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”