యెహెజ్కేలు 7:8 - పవిత్ర బైబిల్8 నేనెంత కోపంగా వున్నానో అతి త్వరలో మీకు నేను చూపిస్తాను. మీమీద నాకున్న కోపాన్నంతా చూపిస్తాను. మీరు చేసిన చెడు కార్యాలకు మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. మీరు చేసిన భయంకరమైన పనులన్నిటికీ మీరు ప్రతి ఫలం చెల్లించేలా చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును, నీమీద నాకోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 త్వరలోనే నా క్రోధాన్ని మీమీద కుమ్మరించబోతున్నాను. నా తీవ్రమైన కోపాన్ని మీమీద చూపించ బోతున్నాను. మీ ప్రవర్తనను బట్టి మీకు శిక్ష విధిస్తాను. మీ నీచమైన పనుల ఫలాన్ని మీ పైకి తీసుకు వస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. నా కోపాన్ని మీమీద చూపిస్తాను. మీ ప్రవర్తనకు మీరు చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. నా కోపాన్ని మీమీద చూపిస్తాను. మీ ప్రవర్తనకు మీరు చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |
ప్రభువునైన నేను యెహోయాకీమును, అతని సంతానాన్ని శిక్షిస్తాను. అతని అధికారులను కూడ నేను శిక్షిస్తాను. వారు దుర్మార్గులు గనుక నేనలా చేస్తాను. ఆ అధికారులపైకి, యెరూషలేము ప్రజలపైకి, యూదా ప్రజలపైకి మహా విపత్తు తీసికొని వస్తానని నేను అనియున్నాను. నేను చెప్పిన విధంగా వారికి అష్ట కష్టాలను తెచ్చి పెడతాను. కారణమేమంటే, వారు నేను చెప్పినది వినలేదు.’”
ఈ విషయాలన్నీ ఎందుకు సంభవిస్తాయి? ఎందుకనగా నీవు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఏమి జరిగినదో నీకు జ్ఞాపకం లేదు గనుక. ఆ చెడ్డ పనులన్నీ నీవు చేసి నాకు కోపం కలిగించావు. ఆ చెడు కార్యాలు చేసినందుకు నిన్ను నేను శిక్షించవలసి ఉంది. అయినా నీవు మరిన్ని భయంకరమైన పనులు చేయటానికి వ్యూహం సిద్ధం చేశావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“‘అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద తిరుగుబాటు చేసింది. వారు నా న్యాయాన్ని పాటించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించారు. పైగా అవి ఎంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్లు వారా విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం చేయ సంకల్పించాను.
“‘కాని ఆ పిల్లలు నాకు వ్యతిరేకులయ్యారు. వారు నా కట్టడలను పాటించలేదు. వారు నా ఆజ్ఞలను లెక్క చేయలేదు. నేను వారికి చెప్పిన పనులు చేయలేదు. అవన్నీ మంచి న్యాయ సూత్రాలు. ఎవ్వరు వాటిని అనుసరించినా, ఆ వ్యక్తి జీవిస్తాడు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ప్రాముఖ్యంలేని వాటినిగా వారు పరిగణించారు. అందువల్ల నేను ఎడారిలో నా ఉగ్రమైన కోపం చూపటానికి వారిని సర్వనాశనం చేద్దామనుకున్నాను.