Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 7:14 - పవిత్ర బైబిల్

14 “ప్రజలను హెచ్చరించటానికి వారు బూరలు ఊదుతారు. ప్రజలు యుద్ధ సన్నద్ధులౌతారు. కాని వారు యుద్ధం చేయటానికి మాత్రం బయటికి వెళ్లరు. ఎందువల్లనంటే నేనెంత కోపంగా వున్నానో ఆ సమూహమంతటికీ చూపిస్తాను గనుక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 వాళ్ళు సర్వసన్నద్ధులై బాకా ఊదారు. కానీ యుద్ధానికి బయల్దేరే వాడు ఎవడూ లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “ ‘వారంతా సిద్ధపడి యుద్ధానికి బూరలను ఊదుతారు. ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది కాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “ ‘వారంతా సిద్ధపడి యుద్ధానికి బూరలను ఊదుతారు. ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది కాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 7:14
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు. యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు. రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు. ఏ ఒక్కరికీ రక్షణ లేదు.


“ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము: “యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము, ‘దేశమంతా బూర వూది’ బాహాటంగా ఇలా చెప్పుము, ‘మీరంతా కలిసి రండి! రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’


“రాజ్యంలో యుద్ధ పతాకాన్నెగుర వేయండి! దేశాలన్నిటిలో బూర వూదండి! బబులోనుతో యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి! బబులోనుతో యుద్ధానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలను పిలవండి. దాని మీదికి సైన్యాన్ని నడపటానికి ఒక అధికారిని ఎంపిక చేయండి. మిడతల దండులా దానిమీదికి ఎక్కువ గుర్రాలను పంపండి.


బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి పారిపోండి! తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి. బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి. మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!


కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉంది! దానిని నేను లోపల ఇముడ్చుకోలేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.


కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”


యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు బలాన్ని క్షయం చేశాడు. ఆయన తన కుడిచేతిని ఇశ్రాయేలు మీదినుండి తీసివేశాడు. శత్రువు వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు. యాకోబు (ఇశ్రాయేలు) లో ఆయన అగ్నిశిలలా మండినాడు. ప్రళయాగ్నిలా ఆయన ఉన్నాడు.


ఒక శత్రువులా యెహోవా తన విల్లు వంచాడు. అయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది. బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన చంపివేశాడు. యెహోవా ఒక శత్రువులా వారిని హతమార్చినాడు. యెహోవా తన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన దానిని సీయోను గుడారాలపై కుమ్మరించాడు.


“మీ స్వంత స్థలంలో మీరు శత్రువుతో యుద్ధం చేయాల్సివస్తే, మీరు వారిమీదికి వెళ్లక ముందు బూరలను గట్టిగా ఊదాలి. అప్పుడు మీ యెహోవా దేవుడు వింటాడు, మీ శత్రువులనుండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ