యెహెజ్కేలు 6:8 - పవిత్ర బైబిల్8 దేవుడు ఇలా చెప్పాడు: “కాని మీలో చాలా కొద్ది మంది తప్పించుకునేలా నేను చేస్తాను. వారు అన్య దేశాలలో స్వల్పకాలం పాటు నివసిస్తారు. వారిని నేను చెల్లా చెదురుచేసి, ఇతర దేశాలలో నివసించేలా ఒత్తిడి చేస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 “ ‘అయినా నేను కొందరిని విడిచిపెడతాను, ఎందుకంటే మీరు వివిధ దేశాలకు జాతుల మధ్యకు చెదరగొట్టబడినపుడు మీలో కొంతమంది ఖడ్గం నుండి తప్పించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 “ ‘అయినా నేను కొందరిని విడిచిపెడతాను, ఎందుకంటే మీరు వివిధ దేశాలకు జాతుల మధ్యకు చెదరగొట్టబడినపుడు మీలో కొంతమంది ఖడ్గం నుండి తప్పించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |
ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!” ఇదే యెహోవా వాక్కు. “నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేనే మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను. కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను. కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను. అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి. నేను మిమ్మల్ని బాగా క్రమశిక్షణలోకి తెస్తాను.”
కొంతమంది యూదావారు కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిప్టునుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించుకోగలిగే యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే ఆ బహు కొద్ది మంది యూదా వారు ఎవరి మాట నిజమవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యినదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసుకుంటారు.
యెహోవా ఇలా అంటున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, భయపడకు. నేను నీతో వున్నాను. నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను. ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను. నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను. నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
నగరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడితులై ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ వంతు నగరం వెలుపల యుద్ధంలో చనిపోతారు. అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! అప్పుడు మాత్రమే నేను నీ పట్ల నా కోపాన్ని ఉపసంహరించుకుంటాను.