Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహెజ్కేలు 5:8 - పవిత్ర బైబిల్

8 అందువల్ల నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “కాబట్టి ఇప్పుడు, నేను కూడా మీకు వ్యతిరేకిని. ఇతర ప్రజలంతా చూసేలా నేను మిమ్ముల్ని శిక్షిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేమా, నేనే నీకు వ్యతిరేకంగా ఉన్నాను, జాతులు చూస్తుండగానే నేను నీకు శిక్ష విధిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేమా, నేనే నీకు వ్యతిరేకంగా ఉన్నాను, జాతులు చూస్తుండగానే నేను నీకు శిక్ష విధిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహెజ్కేలు 5:8
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

“యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను. నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు. నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు. యెరూషలేము వాసులారా ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు, ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.” కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.


యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను.


నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు.


నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు. పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’ ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం. వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు.


యెహోవా ఒక శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగేశాడు. ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు. ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు. మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని, బాధను కలుగ జేశాడు.


యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు. రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.


దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని ఈ నగరం నుండి నేను బయటికి తీసుకొని వెళతాను. మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను. నేను మిమ్మల్ని శిక్షిస్తాను!


కాపున ఇప్పుడు నా ప్రభువైన యెహోవా నిజంగా మాట్లాడతాడు! ఆయన చెప్పినదేమంటే, “మీరు అబద్ధమాడారు. సత్యదూరమైన దర్శనాలను మీరు చూశారు. కావున ఇప్పుడు నేను (దేవుడు) మీకు వ్యతిరేకినయ్యాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.


“ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. కాని వారిలో కొంతమంది పూర్తిగా కాలని పుల్లల వంటివారు. వారు శిక్షింపబడతారు. అంతేగాని వారు సర్వనాశనం చేయబడరు. నేను ఈ ప్రజలను శిక్షించటం నీవు చూస్తావు. ఆ శిక్షించింది యెహోవాయే అని కూడా నీవు తెలుసుకుంటావు!


వారు నీ ఇంటిని (ఆలయం) తగలబెడతారు. ఇతర స్త్రీలందరూ చూచే విధంగా వారు నిన్ను శిక్షిస్తారు. నీవు వేశ్యా జీవితం గడపకుండా నిన్ను కట్టుదిట్టం చేస్తాను. నీ విటులకు నీవు డబ్బు ఇవ్వకుండా నిన్ను ఆపుతాను.


ఇశ్రాయేలు రాజ్యానికిలా తెలియజేయి, ‘యెహోవా ఈ విషయాలు చెప్పాడు, నేను నీకు వ్యతిరేకంగా వున్నాను! ఒరలోనుండి నా కత్తిని దూస్తాను. నీనుండి ప్రజలందరినీ తొలగిస్తాను. వారిలో మంచివారు, చెడ్డవారు అంతా ఉంటారు!


ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని! నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు! నేను సీదోనును శిక్షిస్తాను. ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు. నేను పవిత్రుడనని వారు నేర్చుకుని నన్ను ఆ విధంగా చూసుకుంటారు.


ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!”


యెహోవా ఇలా చెపుతున్నాడు: “నేను ఆ కాపరులకు విరోధిని! నా గొర్రెల కొరకు నేను వారిని అడుగుతాను. నేను వారిని తీసివేస్తాను ఇక ఎంతమాత్రం వారు నా మందకు కాపరులుగా కొనసాగరు! దానితో వారు మందను చంపి తమ పొట్టను నింపుకోలేరు. వారి బారినుండి నా మందను నేను రక్షించుకోగలుగుతాను. అప్పుడు నా గొర్రెలు వారికి ఆహారం కాజాలవు.”


దానితో ఈ విధంగా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “‘శేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని! నేను నిన్ను శిక్షిస్తాను. నిన్నొక పనికిమాలిన బీడు భూమిలా చేస్తాను.


“నరపుత్రుడా, నా తరపున గోగుకు వ్యతిరేకంగా మాట్లాడు. యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయుము, ‘గోగూ, నీవు మెషెకు, తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడవు! కాని నేను నీకు వ్యతిరేకిని.


నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను పరిహసిస్తారు. కాని వారికి నీవొక గుణపాఠంలా కూడ మిగులుతావు. నేను నీ పట్ల కోపగించి, నిన్ను శిక్షించినట్లు వారు చూస్తారు, నేను మిక్కిలి కోపంగా ఉన్నాను. నేను నిన్ను హెచ్చరించాను. యెహోవానైన నేను ఏమి చేస్తానో నీకు చెప్పాను!


సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “నీనెవే, నేను నీకు వ్యతిరేకిని! నీ రథాలను నేను తగులబెడతాను. యుద్ధంలో నీ ‘యువ సింహాలను’ నేను చంపుతాను. భూమి మీద మరెన్నడూ నీవు ఎవరినీ వెంటాడవు. నీ దూతలు చెప్పేవాటిని ప్రజలు మరెన్నడూ వినరు.”


ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.


ఆ వ్యక్తిని యోహోవ క్షమించడు. మరియు, ఆ వ్యక్తిమీద యెహోవాకు కోపం వస్తుంది, యెహోవా ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ యెహోవా అతణ్ణి వేరు చేసేస్తాడు. యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విషయాలన్నీ ఒక భాగం:


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ